మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ రమేష్ కుమార్ ని, రాత్రికి రాత్రి తొలగించటం పై, ఈ రోజు కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం వేసిన కౌంటర్ అలాగే, ప్రభుత్వ కౌంటర్ పై పిటీషనర్ అభ్యంతరాలను కోర్ట్ పరిశీలించింది. అనంతరం, వాదనలకు తమకు ఇంకా సమయం కావాలి అంటూ, ప్రభుత్వ తరుపు న్యాయవాది, అలాగే కొత్త ఎన్నికల కమీషనర్ కనకరాజ్ న్యాయవాది కోర్టుని కోరారు. కనకరాజు తరుపు న్యాయవాది, తమ క్లైంట్ కనకరాజు చెన్నై లో ఉన్నారని, తమకు మూడు వారాల టైం కావాలని కోర్ట్ ని కోరారు. అలాగే ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, తమకు సరిపడినంత స్టాఫ్ లేరని, తమకు కూడా కొంత టైం కావాలని కోర్టును అభ్యర్ధించారు. అయితే ఈ సందర్భంలో, కలుగ చేసుకున్న రమేష్ కుమార్ తరుపు న్యాయవాది, ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్ట్ కు తెలిపారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారని, ఇంకా ఇవ్వనవసరం లేదని అన్నారు.

కొత్త ఎన్నికల కమిషనర్ ను తీసుకు రావటానికి, వీరికి 24 గంటలు కూడా పట్టలేదని, అప్పుడేమో అంత హడావిడిగా తీసుకు వచ్చి, ఇప్పుడు మాత్రం, ఇంకా సమయం కావాలి అంటూ, తాత్సారం చేస్తున్నారని, కోర్ట్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. అలాగే కొత్తగా వచ్చిన ఎన్నికల కమీషనర్, కనకరాజ్, ఈ కేసు తేలే వరకు, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని, అలా ఆదేశాలు ఇవ్వాలని, కోర్టుని అభ్యర్ధించారు. దీనికి స్పందించిన కోర్ట్, స్పష్టంగా చెప్తూ, ఈ కేసు ఇప్పటికే సుప్రీం కోర్ట్ పరిధిలోకి కూడా వెళ్ళింది అని, అప్పట్లో రమేష్ కుమార్ ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వెయ్యటాన్ని, సుప్రీం కోర్ట్ కూడా అంగీకారం తెలిపిన విషయాన్నీ, గుర్తుకు తెచ్చారు.

అంటే ఆరు వారాల పాటు, ఎవరూ ఏ నిర్ణయం తీసుకువటానికి లేదని, ఏప్రిల్ 30 వరకు ఆ గడువు ఉందని, సుప్రీం కోర్ట్ ఆదేశాలు ధిక్కరించి నిర్ణయం తీసుకుంటే, కోర్ట్ ధిక్కరణ అవుతుందని, హైకోర్ట్ బెంచ్ స్పష్టం చేసింది. అలాంటి నిర్ణయాలకు చట్ట బద్ధత ఉండదు అంటూ కోర్ట్ స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ వెయ్యటానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కోర్ట్ ఇచ్చింది. 24 లోపు వెయ్యాలని, దాని పై, కౌంటర్ అఫిదివిట్ వెయ్యాలి అంటే, 27 లోపు వెయ్యాలని, 28న ఫైనల్ హియరింగ్ ఉంటుంది అంటూ కోర్ట్ తేల్చి చెప్పింది. అంటే కోర్ట్ చెప్పిన ప్రకారం, ఏప్రిల్ 30 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవటం కుదరదు, ఎలాగూ, 28న వాయిదా ఉంది కాబట్టి, ఆ రోజు ఏ సంగతి స్పష్టం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read