ఆంధ్రప్రదేశ్ రాస్త్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ రెండు పిటీషన్లు , గత ఏడాది హైకోర్టులో నమోదు అయిన పిటీషన్లు. ఈ పిటీషన్ల ఆధారంగా, ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సిద్ధం అయ్యింది. ఎన్నికల షడ్యులు కూడా విడుదల అయ్యి, నామినేషన్ల దాకా వెళ్ళింది. అయితే క-రో-నా అప్పుడే దేశంలో పెరుగుతూ ఉండటం, కేంద్రం ప్రభుత్వం అనేక జాగ్రత్తలు చెప్పటం, ప్రజలను, ప్రభుత్వాల్ని అప్రమత్తం చెయ్యటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికలను వాయిదా వేసింది. ఆ తరువాత కేంద్రం జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి కార్యక్రమాలు లాంటివి పెట్టటంతో, ఎన్నికల కమిషన్ మంచి నిర్ణయం తీసుకుందని, ప్రజల ప్రాణాలు కాపాడిందని అందరూ అనుకున్నారు. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై అప్పట్లో ప్రభుత్వం ఆగహ్రం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ప్రెస్ ముందుకు రాని జగన్, ప్రెస్ మీటి పెట్టి, కరోనా చాలా చిన్నది, ప్యారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ చల్లితే వైరస్ పోతుంది, సియం నువ్వా నేనా అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి పై విరుచుకు పడ్డారు. ఏకంగా మంత్రులు కూడా, కులం పేరుతొ ఆయన్ను దూషించారు.

తరువాత జరిగిన పరిణామాలతో, నిమ్మగడ్డ పదవి పోవటం, ఆయన న్యాయ పోరాటం చెయ్యటం, హైకోర్టు, సుప్రీం కోర్టులో ఫైట్ చేసి మరీ, మళ్ళీ తన పదవిలో తాను కూర్చున్నారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ కు మధ్య వచ్చిన గ్యాప్ నేపధ్యంలో, తరువాత ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు క-రో-నా పై పూర్తి అవగాహన ఉండటంతో, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో మొన్నటి దాకా ఎన్నికల నిర్వహణ పై ఉత్సాహంగా ఉన్న ఏపి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాయని అందరూ భావించారు. అయితే ఈ రోజు హైకోర్టు విచారణ సందర్భంగా, ఏపి ప్రభుత్వం క-రో-నా కారణంగా ఎన్నికలు జరపలేం అని కోర్టుకు చెప్పింది. అయితే గతంలో ఎన్నికల కమీషనర్ ఇదే మాట చెప్తే విరుచు పడిన ప్రభుత్వం, ఇప్పుడు అదే మాట చెప్పటం గమనార్హం. అయితే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి కదా అంటూ, ఈ మాట ప్రభుత్వం కాదని, ఎన్నికల సంఘం చెప్పాలని, ఎన్నికల కమిషన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 2 కు కోర్టు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read