ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ సిఫారుసు మేరకు, ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, 378 డీఈడీ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తూ, ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను, రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కొద్ది సేపటి క్రితం జారీ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 47 డీఈడీ కాలేజీలు సవాల్ చేసాయి. దీని పైన, ఎన్‍సీటీఈ చట్టంలోని సెక్షన్ 17ను అమలు చేయలేదని, కోర్టుకు తెలిపారు. పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణతో పాటు ముతుకుమల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు, నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు 378 డీఈడీ కాలేజీలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని న్యాయవాదులు వాదనలు వినిపించటమే కాకుండా, ఆన్లైన్ లో తమకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కావలని చెప్పి, కేంద్రంలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కోరిందని వారు హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఆన్‍లైన్‍లో షోకాజ్ నోటీసులిచ్చి, తమ కాలేజీలకు అనుమతులు రద్దు చేయటం ఏమిటో తమకు అర్ధం కావటం లేదు అంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

hc 30032022 2

అసలు రాష్ట్ర ప్రభుత్వం తమకు అధికారాలు లేక పోయినా, పలు నిబంధనలు విధించి, ఈ నిబంధనలు అన్నీ కూడా డీఈడీ కాలేజీలు అమలు చేయలేదని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి వీటి అనుమతి రద్దు చేయాలని, ఎన్‍సీటీఈకి రికమెండ్ చేయటం, చట్ట న్యాయ విరుద్ధం అని కూడా న్యాయవాదులు వాదించారు. అదే విధంగా చట్టంలోని సెక్షన్ 17ను అమలు చేయలేదని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున న్యాయవాదులు, ప్రభుత్వం తరుపున చెప్పే వాదనలు కూడా హైకోర్టు వింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, డీఈడీ కాలేజీలు నిబంధనలు పాటించటం లేదని పేర్కొంది. అందుకే వారి అనుమతులు రద్దు చేయాలని కోరం అంటూ కోర్టుకు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఢిల్లీలోని ఎన్‍సీటీఈ ఉత్తర్వులను కొట్టేసింది. కేసు విచారణ వాయిదా వేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో మొత్తం దేశంలో ఉన్న 378 డీఈడీ కాలేజీలకు ఉపసమనం కలిగింది అని చెప్పవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read