జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, రాష్ట్రంలో అన్ని పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు, బ్రాండింగ్ చేస్తూ, వైసీపీ పార్టీ రంగులు వేసిన కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైనా పని వేగంగా జరుగుతుంది అంటే, అది రంగులు వెయ్యటమే అని, వెటకారం ప్రజలు మాట్లడకుంటూ ఉండటం వింటున్నాం. రాష్ట్రంలో ఎవరికి పనులు లేకపోయినా, పెయింట్లు వేసే వారికి, మాంచి ఉపాధి ఈ రాష్ట్రంలో ఉంది. వాటర్ ట్యాంకులు నుంచి కరెంటు స్థంబాలు దాకా, అన్నిటికీ రంగులు వేసేస్తున్నారు. పంచాయతీ భవనం అయినా, స్కూల్ అయినా, అన్ని రకాల ప్రజలు వస్తారు, అన్ని పార్టీలు, అన్ని కులాలు వారు, వారి వారి పనులు కోసం, వస్తూ ఉంటారు. అయితే, అలాంటి వాటికి, ఒక పార్టీకి సంబంధించిన రంగులు వెయ్యటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, స్కూల్స్ లోను, పంచాయతీ భవనాల్లోనే జరుగుతాయి, అలాంటి చోట, పార్టీ రంగులు వెయ్యటం తప్పు అని అందరూ అంటున్నారు.

అయితే ఈ నేపధ్యంలోనే, హైకోర్ట్ లో కొంత మంది కేసు వేసారు. హైకోర్ట్ ఈ కేసు పై విచారణ జరిపి, ఒక పార్టీ రంగులు, ప్రభుత్వ భవనాలకు వెయ్యటం పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే రంగులు మార్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఇలా రంగులు వెయ్యటమే తప్పు అనుకుంటే, ఏకంగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పై, సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. అయితే సుప్రీం కోర్ట్, ఇంకో రెండు మాటలు ఎక్కువ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఫోటో ప్రతి చోటా పెట్టారు, మేము కూడా సుప్రీం కోర్ట్ లో సీజే ఫోటో పెట్టుకోమా, అలాగే అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయం రంగు వేసేద్దమా అంటూ, ప్రశ్నించింది. మీరు చేసింది తప్పు అంటూ, సుప్రీం కోర్ట్ లో కూడా తీర్పు వచ్చింది.

దీంతో హైకోర్ట్ మళ్ళీ ఆదేశాలు ఇస్తూ, ఇప్పటికే సుప్రీం కోర్ట్ మా తీర్పుని సమర్ధిస్తూ ఆదేశాలు ఇచ్చింది, ఇప్పటికైనా మీరు రంగులు తొలగించండి, మూడు వారాల్లో రంగులు తొలగించండి, అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళవద్దు అంటూ, ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం, కొత్త రంగులు అంటూ, వైసీపీ మూడు రంగులు అలాగే ఉంచి, కింద పక్క మాత్రం మట్టి రంగు వేసారు. వైసీపీ మూడు రంగులకు నిర్వచనం చెప్తూ, జీవో ఇచ్చారు. ఆకుపచ్చ రంగు, పాడి పంటలకు నిర్వచనం అని, నీలు రంగు నీలి విప్లవానికి నిర్వచనం అని, తెలుపు పాల విప్లవానికి నిర్వచనం అని, తెలుపుతూ, జీవో నంబర్‌ 623 ఇచ్చారు. అయితే ఈ జీవో సవాల్ చేస్తూ, న్యాయవాది సోమయాజులు హైకోర్ట్ లో కేసు వేయటంతో, పోయిన వారం ఆ జీవో సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణ ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేసిన కోర్ట్, మేము ఆ రంగులు వెయ్యొద్దు అని చెప్పినా, ఎందుకు వేసారు అని అడగగా, ఆ రంగులు ఏ ఉద్దేశంతో వేసామో, పూర్తీ వివరాలు జీవోలో ఇచ్చామని కోర్ట్ కు తెలిపారు. మరో రంగు పెట్టామని చెప్పారు. అయితే ఈ రోజు వాదనలు పూర్తికావటంతో, హైకోర్ట్, ఈ కేసు పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read