2018లో గుంటూరు అర్బన్ పరిధిలో వచ్చే పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై కొంత మంది దా-డి చేసారు. ఒక చిన్నారి పై అ-త్యా-చా-రం చేసిన ఘటనలో, ఒక సామాజికవర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అందరూ గుమిగూడి, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దా-డి చేయటం జరిగింది. అయితే అదే రోజు, సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్పీ పై కూడా చెప్పులు విసిరారు. అయితే అదే రోజు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జరిగిన పరిణామాన్ని చాలా తీవ్రంగా తీసుకుని, వారి పై కొంత మంది పై పదులు సంఖ్యలో కేసులు నమోదు చేసారు. కొంత మందిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. అయితే ఆ ఘటనలో వైసీపీ సానుభూతి పరులు కూడా ఉండటంతో, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వైసీపీ పేర్లు వరకే తప్పిస్తే చెడ్డ పేరు వస్తుందని, ఆ కేసు మొత్తాన్ని కూడా ఉపసంహరించుకుంటూ, ఏకంగా జీవోలో ఆ సామాజికవర్గం పేరు రాసి మరీ, వారి పై ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేసారు. దీని పై కేసుని ఉపసంహరించుకుంటూ కూడా ప్రభుత్వం, ప్రసిక్యుషన్ నుంచి కూడా తప్పుకున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది.
దీని పై గతంలో హైకోర్టులో పలు సార్లు విచారణ జరిగింది. విచారణ సందర్భంలో, హైకోర్టు, సిబిఐని, ఎన్ఐఏను కూడా పార్టీగా చేరుస్తూ విచారణ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ప్రకారం, సిబిఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ఎన్ఐఏను కూడా పార్టీగా చేయాలని చెప్పి, హైకోర్టు చెప్పింది. ఈ మొత్తం పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ రోజు మొత్తం అన్నీ పరిశీలించిన హైకోర్టు ఈ కేసుకి సంబందించిన తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ కేసు పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేదాని పై ఆసక్తి నెలకొంది. ఒక వేళ ఈ కేసు రీఒపెన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దాని పైకూడా చర్చ జరుగుతుంది. సిబిఐ, ఎన్ఐఏ ని కూడా పార్టీలను చేసారు కాబట్టి, వారి పాత్ర ఎలా ఉంటుంది, ఒక వేళ కేసు రీఓపెన్ చేస్తే, వారికే ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఇష్టం వచ్చినట్టు సగంలో ఉన్న కేసులను ప్రభుత్వం అర్ధాంతరంగా మూసేయటం పై కూడా కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.