ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్ లో చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను, హైకోర్టు కొట్టివేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు, ఈ జిల్లాల వరకు కూడా ఆంధ్రా యూనివర్సిటీ ఏరియా పరిధిగా, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి తీసుకుని వచ్చింది. ఈ పరిధిలో ఉన్న వారు ఎవరికైనా సరే, స్థానికంగా ఉన్న వారికి 85 శాతం అడ్మిషన్లు, బయట నుంచి వచ్చే వారికి 15 శాతం వర్తిస్తాయని ఏపి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తి అవ్వటంతో, పలు విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, ఏపి హైకోర్టుఐ ఆశ్రయించారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరంద్రా జిల్లాల నుంచి అనేక మంది వచ్చి, గుంటూరు, కృష్ణా జిల్లాలలోని రెసిదేన్షియల్ కాలేజీల్లో వచ్చి చదువుకుంటారని, ఇంటర్ అడ్మిషన్లు పూర్తయిన తరువాత, ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టాలని, గతంలో చేసిన అడ్మిషన్లు రద్దు చేయాలని, ఏపి ప్రభుత్వం, ఎటువంటి సంప్రదింపులు ఎవరితో చేయకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అంటూ, కోర్ట్ కు తెలిపారు.
ఏకపక్షంగా ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది అని, ఈ ఉత్తర్వులు రద్దు చేయలని హైకోర్టు ముందు వాదించారు. దీంతో హైకోర్టు పరిశీలిన జరిపి, జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు ధర్మాసనం, కొద్ది సేపటి క్రితం, తీర్పు చెప్పంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ ఏడాదికి గతంలో ఏ విధంగా అయితే, అడ్మిషన్లు నిర్వహించారో, అదే విధంగా అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, ముందుగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుని, ఆ తరువాత వాటి అన్నిటినీ క్రోడీకరించి, అందరి ఆమోదయోగ్యంతోనే, ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్ల చేపట్టాలని, హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇది కూడా వచ్చే విద్యా ఏడాది నుంచి మాత్రమే చేయాలని హైకోర్టు సూచించింది. తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్ధులు, వీరి అందరి అభిప్రాయం తీసుకుని మాత్రమే , ముందు వెళ్ళాలని హైకోర్టు ఆదేశిస్తూ, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను, హైకోర్టు రద్దు చేసింది.