జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీసుకున్న మరో చట్ట విరుద్ధమైన నిర్ణయంతో, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పధకం అమలుకు సంబంధించి, రాష్ట్ర హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా విద్యా దీవెన పధకం కింద, విద్యార్ధులు ఫీజు నిమిత్తం చెల్లించే డబ్బు అంతా కూడా, తల్లులు ఖాతాలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇన్నాళ్ళు ఫీజులు, ప్రభుత్వం కాలేజీలు ఖాతాల్లో వేస్తూ వస్తుంది. అయితే తమకు ఎన్నికల్లో లబ్ది కోసం అని, రూల్స్ మార్చేసి, ప్రభుత్వం ఆ డబ్బు అంతా కూడా విద్యార్ధుల ఖాతాలో వేస్తాం అని, అక్కడ నుంచి తల్లులు, కాలేజీలకు వేయాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. దీంతో రాయలసీమకు సంబంధించి, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు అన్నీ కూడా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో దీని పైన సుప్రీం కోర్టు సింగల్ జడ్జి విచారణ చేసి, ఈ డబ్బులు తల్లులు ఖాతాలో వేయటం ఏమిటి అని, నేరుగా కాలేజీల ఖాతాలో వేయొచ్చు కదా అని చెప్తూ, అదే తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తల్లులు ఖాతా నుంచి, అక్కడ నుంచి కాలేజీల ఖాతాలోకి వేయటానికి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం రివ్యూకి వెళ్ళింది.

hc 13122021 2

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై, రివ్యూ పిటీషన్ దాఖలు చేయటంతో, ఈ రోజు ఈ కేసు డివిజినల్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ రివ్యూ పిటీషన్ పై, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా, ఇటు వైపు నుంచి కాలేజీల యాజమాన్యం తరుపున, సీనియర్ న్యాయవాది వెంకటరమణ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పూర్తయిన అనంతరం, హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో సింగల్ జడ్జి ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఆ తీర్పుని సమర్ధించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటీషన్ ని కూడా కోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యా దీవెన పధకం కింద, తప్పనిసరిగా, ఈ డబ్బులు అన్నీ కూడా కాలేజీల ప్రిన్సిపాల్ ఎకౌంటు లోనే వేయాలని చెప్పి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తల్లులు ఖాతాలో డబ్బులు వేయలని గతంలో ఇచ్చిన జీవో ఉందో, ఆ జీవోని కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మరి దీని పైన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో, లేక సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి, అక్కడ కూడా చెప్పించికుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read