గత నెలలో తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, 11 మంది మరణించిన సంఘటన పై , ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. తిరుపతి పట్టణ వాసి ఒకతను, ఈ అంశం పై, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం తరుపున అడ్వొకేట్ బాలాజీ వాదించారు. రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, మరణించిన సంఘటన పై నేటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని చెప్పారు. అదే విధంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మరణించిన వారికి, ఒక్కొక్కరికి కోటి రూపాయలు సాయం చేసి, తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి మాత్రం, కేలవం పది లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చారని, ఇదేమి ద్వంద్వ విధానం అని ప్రశ్నించారు. అది ప్రైవేటు సంస్థలో జరిగినా కోటి ఇచ్చారని, ఇక్కడ ప్రభుత్వ బాధ్యత ఉన్నా కేవలం పది లక్షలు ఇచ్చారని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. ఈ నేపధ్యంలో హైకోర్టు స్పందిస్తూ, తిరుపతి రుయా ఘటన పై, పూర్తీ నివేదిక మా ముందు ఉంచాలని ఆదేశించింది. అదే విధంగా దీని పై ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది ప్రశ్నించిన సందర్భంలో, హైకోర్టు కలుగు చేసుకుని, దీని కంటే ఎక్కువగా తాము ఆలోచిస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. అదే విధంగా, దీంతో పాటు, హైకోర్టులో మరో ఆసక్తికర సంఘటన జరిగింది.

hc 280962021 2

రుయా హాస్పిటల్ లో మరణించిన కుటుంబాలకు ఇప్పటికే పరిహారం చెల్లించామని ప్రభుత్వం విపు నుంచి చెప్పగా, అసలు ఎవరి బాధ్యత ఇందులో ఉందని పరిహారం చెల్లించారు ? ఇందులో అసలు ఎవరు బాధ్యులు ? ఎందుకు ఆక్సిజన్ ఆగిపోయింది ? అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోయారు ? ఆక్సిజన్ లేక మరణిస్తే, దీనికి ఎవరు బాధ్యులు ? ఎవరు దీనికి బాధ్యులో చెప్పాలని చెప్పి, హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటికీ సంబంధించి, తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారల లోపు, ఈ నివేదిక తమ ముందు ఉంచాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం నివేదిక తమ ముందు ఉంచిన తరువాత, దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు చెప్పింది. రెండు వారాల తరువాత నివేదిక వచ్చిన తరువాత, దీని పై తగు చర్యలు తీసుకుంటాం అని, హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు రెండు వారాలకు వాయిదా పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read