ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది. సోలార్ టెండర్లు రద్దు చేసి, తాజాగా టెండర్లు పిలవాలని ఏపి హైకోర్టు ఆదేశించింది. 6400 మెగావాట్ల సామర్ధ్యంతో, మెగా సోలార్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు పిలిచి మూడు నెలలు అవుతున్నా, ఇందులో టాప్ వచ్చినవి మాత్రం, ఆదానీ పవర్, శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఈ రెండు కంపెనీలు మాత్రమే వచ్చాయి. అయితే టెండర్లు ఖరారు చేయవద్దు అంటూ, అప్పట్లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఈ రోజు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఈ టెండర్ రద్దు చేసింది. ప్రధానంగా విధ్యత్ కొనుగోలు ఒప్పందాలు సైతం కూడా, తాజాగా మళ్ళీ రూపొందించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. దీంతో పాటుగా, ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ టెండర్లను సవాల్ చేస్తూ, టాటా పవర్ ఎనర్జీ ఏపి హైకోర్టుని ఆశ్రయించింది. ముసుయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిబంధనలను, కేంద్ర విద్యుత్ చట్టానికి, ఈ టెండర్ విరుద్ధంగా ఉంది అంటూ, టాటా పవర్ న్యాయవాదులు, హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.
దీంతో పాటుగా, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలు తలెత్తినా, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యుత్ నియంత్రణ మండలికి ఉంటుంది కానీ, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం అనేది చట్ట విరుద్ధం అని వాదించారు. ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధనలు లేవని న్యాయవాదులు వాదించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించటం అనేది జరిగితే, ఒక పక్షానికి మాత్రమే లబ్ది చేకూర్చే అవకాసం ఉంటుందని తాము భావిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇదంతా కూడా విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63కి పూర్తి విరుద్ధం అని చెప్పి, అదే విధంగా కేంద్ర ఇంధన శాఖలో, 2007లో జారీ చేసిన బిడ్డింగ్ మార్గదర్శక సూత్రాలకు కూడా ఈ మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు విరుద్ధంగా ఉన్నాయని కూడా వాదించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుపున కూడా వాదనలు విన్నారు. ఈ వాదనలను, ఇరు పక్షాల నుంచి విన్న హైకోర్టు, నిన్న ఈ కేసు పై తీర్పు ఇచ్చింది. మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేస్తూ, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇచ్చింది.