ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో, ఒక సంక్షేమ కార్యక్రమంగా, గత కొంత కాలంగా వితంతువులకు పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం, కొంత మందికి వితంతు పెన్షన్లు నిలిపివేయటం పై, కొంత మంది హైకోర్టుని ఆశ్రయించారు. దీని పై హైకోర్టులో దాదాపుగా రెండు నెలల నుంచి కూడా, ఈ పిటీషన్ పై వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే వితంతు పెన్షన్లు ఆపటం పై, హైకోర్టు ఈ రోజు కీలక తీర్పుని చెప్పింది. వితంతు పెన్షన్లు నిలిపివేయటం పై, రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాజకీయ కారణాలతోనే ఈ పెన్షన్లు నిలిపివేశారు అనే ఉద్దేశంతోనే హైకోర్టు ఉందని, వెంటనే ఆపేసిన వితంతు పెన్షన్లు పునరుద్దించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా, ఎప్పటి నుంచి అయితే ఈ పెన్షన్లు ఆపేసారో అప్పటి నుంచి ఉన్న బకయాలుని కూడా ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ కొనసాగించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొంత మంది వితంతువులు కాకపోయినా, పెన్షన్ కోసం వితంతువులుగా చెప్తున్నారు అంటూ, ప్రభుత్వం అఫిడవిట్ లో చెప్పిన విషయం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన దేశంలో వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైనది అని, ఏ మహిళా కూడా భర్తా ఉన్నా కూడా, తమకు భర్తు లేదు, ఒంటరిగా జీవిస్తున్నాం అని చెప్పే అవకాసం ఏ మహిళాకు ఉండదు. ఒంటరి జీవితం ఎంత దుర్భాలంగా ఉంటుందో, ఆర్ధిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రతి ఒక్కరికీ తెలుసు, మన కళ్ళ ముందు ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు వారి ఆర్ధిక బాధలను తీరుస్తాయని, ప్రభుత్వం ఎన్నో అనవసరపు ఖర్చులు చేస్తుందని, గోదావరి పుష్కరాలకు, పండగలప్పుడు సరుకులకు ఎవరు ఖర్చు పెట్టమన్నారు ? భావనలకు ఖర్చు చేసి రంగులు ఎవరు వెయ్యమన్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక బద్రతా పెన్షన్లు ఇవ్వటం ఎవరూ కాదనరు, కానీ రాజకీయ కారణాలతో పెన్షన్లు ఆపటం మాత్రం, ఒప్పుకోం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఆ పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించింది.