కక్ష సాధింపులకు పాల్పడటం, జేసీబీలు పంపించటం, కూల్చివేయటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతిపక్ష నేతల పై అనేక ఘటనలు ఇలాంటివి జరిగాయి. టిడిపి సానుభూతిపరులను కూడా వదిలి పెట్టలేదు. ఆర్ధికంగా దెబ్బ తేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేయటం, దానికి బ్లూ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళను అల్లరి చేయటం, ఇవన్నీ ఒక పధ్ధతి ప్రకారం జరుగుతాయి. తప్పు ఒప్పు అనేది తరువాత, ముందు వారిని అల్లరి చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఇదే వారి నైజం. కొన్ని నెలలు క్రిందట, విశాఖలోని ఫ్యుజన్ ఫుడ్స్ గురించి కూడా ఇదే ఫార్ములా ఉపయోగించింది బ్లూ బ్యాచ్. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. విశాఖలో ఉన్న ఫ్యుజన్ ఫుడ్స్ ఆక్రమణలో ఉంది అంటూ, విశాఖ నగర పాలక సంస్థ అధికారులు, ఆరు నెలల క్రితం తొలగించారు. అప్పట్లో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫ్యుజన్ ఫుడ్స్ టిడిపి సానుభూతి పరులకు చెందినది అని తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫ్య్జన్ ఫుడ్స్ అధికారి, తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చి తొలగించారని హైకోర్టుని ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఉన్న సింగల్ బెంచ్, ఈ తొలగింపు అక్రమం అని, సమయం ఇవ్వకుండా, ఎలా చేస్తారు అని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు అపీల్ కు వెళ్ళింది. డివిజనల్ బెంచ్ లో, అటు ఫ్యుజన్ ఫుడ్స్ నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన తరువాత, హైకోర్టు ఈ అంశం పై సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అపీల్ ను హైకోర్ట్ కొట్టేసింది. అదే విధంగా ఫ్యుజన్ ఫుడ్స్ కి, ఆ స్థలాన్ని వారం రోజుల్లో అప్పగించాలని విశాఖ నగర పాలక సంస్థ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిన్న ఈ మేరకు హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ నేతల నోట్లో పచ్చి వేలక్కయి పడినట్టు అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో అల్లరి చేసిన బ్లూ బ్యాచ్ కు కూడా షాక్ తగిలింది. అటు సింగల్ బెంచ్ లో, ఇటు డివిజనల్ బెంచ్ లో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు అనే విషయం ఇప్పటికైనా గుర్తిస్తారో, లేదా సుప్రీం కోర్టుకు వెళ్లి, సుప్రీం కోర్టు కూడా చెప్పించుకుని, అప్పుడు కానీ కిందకు వస్తారో రారో చూడాలి.