జగన్ మోహన్ రెడ్డి, ఆయన బృందం, ఏది తలిస్తే, అది రివర్స్ లో జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం, దూకుడు స్వాభావంతో, పర్యావసానాలు ఆలోచించకుండా, మొండిగా వెళ్ళటమే. జగన్ వచ్చిన తరువాత తీసుకున్న పీపీఏ ల నిర్ణయంతో, దేశం పరువు పోవటంతో, ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక అలాగే పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ కాని, ఇలా చెప్పుకుంటూ, పొతే 52 కేసుల్లో మొట్టికాయలు పడ్డాయి. అయినా ప్రభుత్వం తీరు మాత్రం మారటం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ప్రభుత్వ భవనాలకు వేస్తున్న, వైసీపీ పార్టీ మూడు రంగులు. అదేదో తమ పార్టీ భవనాలు అన్నట్టు, కనిపించిన ప్రతి పార్టీ భవనానికి, రంగులు వెయ్యటం మొదలు పెట్టింది వైసీపీ. ఇది వికృత రూపం దాల్చి, కనిపించిన ప్రతి దానికి వెయ్యటం మొదలు పెట్టారు. దీంతో ఈ విషయం పై కోర్ట్ కు వెళ్ళటం, హైకోర్ ట్లో ఎదురు దెబ్బ తగలటం, తరువాత సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం, అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలటం అన్నీ జరిగిపోయాయి.

ఇప్పుడు తాజగా మళ్ళీ ఈ వ్యవహారం హైకోర్ట్ వద్దకు వచ్చి ఆగిన సంగతి తెలిసిందే. గతంలో హైకోర్ట్ పది రోజుల్లో రంగులు మార్చాలి అంటూ గడువు ఇవ్వటం, ఆ గడువు లోపు ప్రభుత్వం ఆ పని చెయ్యక పోవటంతో, కోర్ట్ కు వెళ్లారు. అయితే, కోర్ట్ కు వెళ్ళి, తమకు మరింత సమయం కావాలని కోరారు. దీనికి కోర్ట్ అంగీకరించలేదు. మీ ఇష్టం వచ్చినట్టు గడువు పెంచటం కుదరదు అని, మీ వ్యవహారం చూస్తుంటే ఎన్నికలు అయ్యే దాకా, రంగులు మార్చేలా లేరే అంటూ, వార్నింగ్ ఇస్తూ, తమకు ఎన్ని రోజుల్లో మీరు రంగులు మార్చుతారో, సోమవారంలోగా చెప్పాలని, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు రంగుల విషయం పై, హైకోర్ట్ లో మళ్ళీ వాదనలు జరిగాయి.

ఈ విషయం పై, ప్రభుత్వం స్పందిస్తూ, తమకు మూడు వారాలు గడువు కావలని కోరింది. అయితే ప్రభుత్వం స్పందన పై కోర్ట్ అంగీకరిస్తూ, సంచలన షరతు విధించింది. మూడు వారాలు సమయం ఇస్తూనే, మీరు రంగులు మార్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపటానికి వీలు లేదు అంటూ, సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ విషయం పై మీరు సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం, అక్కడ కూడా మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి, ఇక లేట్ చెయ్యకుండా, హైకోర్ట్ ఆదేశాలు పాటించాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వెయ్యాలి అనే దాని పై, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని వేసి, వారి నిర్ణయం ప్రకారం, రంగులు మార్చాలి అని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read