కొన్ని కొన్ని వ్యవస్థలు అంటే, ఈ దేశంలో పుట్టిన ఎవరైనా భయపడతారు, కొన్ని వ్యవస్థలను గౌరవిస్తారు. చివరకు ప్రధాని మంత్రి కూడా గౌరవించాల్సి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఈ దేశంలో ఎంతటి పదవిలో ఉన్న సరే, న్యాయ వ్యవస్థని రెండో ఆలోచన లేకుండా గౌరవించాల్సిందే. అలంటి న్యాయ వ్యవస్థను, కొంత మంది పని గట్టుకుని, ఒక ఆర్గనైజడ్ గా అటాక్ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక తీర్పులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు అంటూ, ఉద్దేశాలు ఆపాదించి, ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుతో పాటుగా, న్యాయమూర్తుల పైన కూడా అసభ్యకరంగా రాతలు రాసారు. అయితే ఈ కేసుని హైకోర్ట్ సుమోటోగా తీసుకుని. హైకోర్టు రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, ముందుగా సిఐడి ఎంక్వయిరీకి ఆదేశించగా, సిఐడి సరిగ్గా దర్యాప్తు చేయక పోవటం, ఒక్కరిని కూడా పట్టుకోక పోవటంతో, సిబిఐకి అప్ప చెప్పింది. అయితే సిబిఐ కూడా ముందు పెద్దగా అరెస్ట్ లు చేయలేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, సిబిఐ కూడా దూకుడు పెంచి, దాదాపుగా పది మంది పైగా అరెస్ట్ చేసింది. ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారని, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని, సిబిఐ , ఇప్పటికే కోర్టుకు తెలిపింది.
అయితే సిబిఐ అరెస్ట్ చేసిన కొంత మంది, హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసరు. తమను వదిలేయాలని కోరారు. దీని పైన హైకోర్టు సీరియస్ అయ్యింది, వారి పిటీషన్లు కొట్టేసింది. తీర్పులో అనేక కీలక విషయాలు ప్రాస్తావించింది. ఈ కేసులో నిందితులను సిఐడి పట్టుకోలేక పొతే, సిబిఐకి ఇచ్చాం అని, సిబిఐ కి కూడా వారిని పట్టుకుంటానికి ఏడాది పట్టిందని చెప్తూ, వారు వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయో, ఈ ఘటనే చెప్తుందని కోర్టు తెలిపింది. ఏకంగా కోర్టులను , జడ్జిలను తిట్టే ఇలాంటి వారిని చూస్తూనే, న్యాయవస్థ పైన కుట్రలా ఉందని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటికీ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారంటే, ఇది జడ్జిలను పర్సనల్ గా టార్గెట్ చేయటం కాదని, ఇది న్యాయవస్థ పైనే కుట్ర అని కోర్టు పేర్కొంది. అరెస్ట్ చేసిన వారు చిన్న వారు అయి ఉండొచ్చు కానీ, వారి వెనుక పెద్ద తలకయాలు ఉండే అవకాసం ఉందని కోర్టు స్పష్టం చేస్తూ, ఇంకా విచారణ పూర్తి కాలేదు కాబట్టి, ఇంకా కొంత మందిని అరెస్ట్ చేయాలి కాబట్టి, బెయిల్ పిటీషన్ కొట్టేసింది.