ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు పైన, జడ్జిల పైనా, న్యాయమూర్తులు పైన ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వారి కేసు విషయంలో, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, కొంత మంది ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయం పై దాఖలు అయిన పిటీషన్ విషయంలో, హైకోర్టు విచారణకు తీసుకుని, సుమారుగా వంద మంది పేర్లు చెప్పి, వారిని అరెస్ట్ చెయ్యమని చెప్పటంతో, సిఐడి ఈ కేసు తీసుకుంది. అయితే ఈ 90 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. ఈ కేసు విషయం పై సిఐడి, కోర్టుకు చెప్తూ, వారు నోటీసులు తీసుకోవటానికి అందుబాటులో లేరని తెలిపారు. అయితే దీని పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా సరిగ్గా అమలు కాకపోతే, మేమే ఇతర నిబంధనల మేరకు, ఇతర అధికారాలు ఉపయోగిస్తాం అంటూ, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. అసలు రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా లేదా అని నిలదీసింది.
న్యాయముర్తులనే అవమానిస్తారా, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో, కోర్టుల పై , జడ్జిల పై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించంటం పై కుట్ర ఉందేమో అని, హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా, ఎవరు న్యాయమూర్తులను దూషించే సాహసం చెయ్యరని, దీని వెనుక ఉన్న కుట్ర తేలుస్తాం అంటూ హెచ్చరించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని చూస్తూ కూర్చోం అని, సహించం అని హెచ్చరించింది. హైకోర్టు మీద నమ్మకం లేకపోతె, పార్లమెంట్ కు వెళ్లి, హైకోర్టు ముసేవేయాలని కోరండి అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజా స్వామ్యం మూడు స్థంబాల పై ఆధారపడి ఉందని, న్యాయ్వస్థ బలహీనం అయితే, సివిల్ వార్ కు దారి తీసే అవకాసం ఉందని, న్యాయవ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరి పైనా ఉందని వ్యాఖ్యలు చేసింది.న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేకపోతే, అందరు లా అండ్ ఆర్డర్ తమ ఆధీనంలోకి తీసుకుంటారని వ్యాఖ్యానించింది.