ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. మీకు మా తీర్పు ఇష్టం లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళండి, అంతే కానీ మా తీర్పుని పాటించం, మా ఇష్టం అంటే కుదరదు, మీ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అన్ని అవకాశాలు మాకు ఉన్నాయి, దీని పై సుమోటోగా చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడం, మేము ఎంత వరకు అయినా వెళ్తాం, హద్దుల్లో ఉండమని మీ అధికారులకు చెప్పండి, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతాం అంటే కుదరదు, మిమ్మల్ని ఎవరు వచ్చి కాపాడతారో చూస్తాం అంటూ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా తిరుమలయప్పపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ గ్రామా సచివాలయం కడుతున్నారు అంటూ, ప్రజా ప్రయోజన వాజ్యం గత్మలో హైకోర్టులో దాఖలు అయ్యింది. దీని పై సెప్టెంబర్ నెలలో స్పందించిన హైకోర్టు, స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అక్కడ ఏ నిర్మాణాలు జరపటానికి వీలు లేదు. అయితే మళ్ళీ అక్కడ అధికరులు గ్రామ సచివాలయం కాకుండా, రైతు భరోసా కేంద్రం నిర్మాణం మొదలు పెట్టారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ, పిటీషనర్ మళ్ళీ కోర్టుకు వచ్చారు. కోర్టుకు విషయం తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా అక్కడ మరో నిర్మాణం చేస్తున్నారని, తెలివిగా, ఆన్లైన్ లో , సర్వే నెంబర్ కనిపించకుండా చూసుకున్నారని, కోర్టుకు తెలిపారు. అయితే మేము ఉత్తర్వులు ఇచ్చినా, అక్కడ ఎలా నిర్మాణం చేపడతారు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

hc 10112020 2

ఇప్పడు ఈ రైతు భరోసా కేంద్రం పై స్టేటస్ కో ఇస్తే, రేపు మరో బిల్డింగ్ కడతారా అని ప్రశ్నించింది. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, గతంలో గ్రామ సచివాలయం పైనే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, ఆ స్థలం పెద్దదని, దాని పక్కన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. దీని పై కోర్టు భగ్గు మంది, ఏది ప్రజా ప్రయోజనమో మాకు తెలుసు, అని విషయాల గురించి మాకు తెలిసు. ఒకసారి మేము ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా అక్కడ వేరే నిర్మాణం ఎలా చేపడతారు, ఇది కోర్టు ధిక్కారం కాదా ? మేము ఇచ్చిన తీర్పులో ప్రతి అక్షరం పాటించాల్సిందే, మీకు అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్ళండి. అంతే కానీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించే హక్కు మీకు లేదు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో పాట్నాలో ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, కోర్టుకు పిలిపించి, అటు నుంచి అటే జైలుకు పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. దీని పై కోర్టు ధిక్కారం కింద పిటీషన్ దాఖలు చేయాలనీ, పిటీషనర్ ను కోరింది. రాజకీయ నాయకులకు వత్తాసుగా అధికారులు ఉంటాం అంటే కుదరదు అని, మేము ఆక్షన్ తీసుకుంటే ఎవరు వస్తారో చూస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చి, కేసుని డిసెంబర్ నెలకు వాయిదా వేసింది, హైకోర్టు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read