ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు విషయంలో, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన తరువాత కూడా, జగన్ ప్రభుత్వం అవే రంగులు వెయ్యటం పై, హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న రంగులు జీవో రద్దు చేసిన తరువాత, జగన్ ప్రభుత్వం మరో జీవోతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జీవో 623 అనే జీవోతో, వైసీపీ మూడు రంగులకు తోడుగా, మట్టి రంగు కూడా కలపాలని జీవో ఇస్తూ, మళ్ళీ రంగులు మొదలు పెట్టారు. అయితే, ఈ విషయం పై సోమయాజు అనే న్యాయవాది, హైకోర్ట్ ద్రుష్టికి తెచ్చారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఉల్లంఘించి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రంగులు వేస్తుంది అని తెలిపారు. దీని పై గత పది రోజులుగా హైకోర్ట్ లో విచారణ జరిగింది. రెండు రోజుల క్రితం వాదనలు ముగియటంతో, హైకోర్ట్ తీర్పు రిజర్వులో పెట్టింది. దీని పై, ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. జీవో 623ని సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

రంగుల అంశం పై హైకోర్టు, సుప్రీం కోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది హైకోర్ట్. తమ ఉత్తర్వులు పట్టించుకోనందుకు, కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ మొదలు పెట్టాలని, ఈ కేసును సుమోటోగా తీసుకుంటామని హైకోర్ట్ తెలిపింది. ఈ కేసు 28వ తారిఖున విచారణకు వచ్చే అవకాసం ఉంది. ఈ విషయం పై, సీఎస్, ఈసీ, పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది. హైకోర్ట్ సుమోటోగా కేసు తెసుకుని, కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ మొదలు పెట్టాలని, ఆదేశాలు ఇచ్చినట్టు, న్యాయవాది సోమయాజు తెలిపారు. గతంలో ఇదే విషయం పై హైకోర్ట్ స్పష్టంగా తీర్పు ఇచ్చిందని, దీని పై సుప్రీం కోర్ట్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది అని, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన తరువాత కుడా, ప్రభుత్వం ఇలా చెయ్యకూడదు అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read