ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిన కేసులో, గత ప్రభుత్వం కేసులు పెట్టింది. 2018 మే నెలలో కొంత మంది యువకులు, ఒక పద్దతి ప్రకారం పోలేస్ స్టేషన్ పై దాడి చేసారు. దీంతో గత ప్రభుత్వంలో పోలీసులు కేసు నమోదు సెహ్సారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఆగస్టు 12న, జీవో 776 ను విడుదల చేసి, ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. అయితే దీని పై దుగ్గిరాలకు చెందిన పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో దీని పై పిటీషన్ దాఖలు చేసారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద, పిటీషన్ దాఖలు చేసారు. దీని పై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. దీని పై స్టే ఇచ్చిన హైకోర్టు, ఎన్ఐఏని కూడా ప్రతివాదిగా చేర్చాలని పితీషినర్ ను కోరింది. అయితే ఈ కేసు ఇప్పుడ మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. పిటీషనర్ స్పందిస్తూ, కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్ఐఏను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటీషన్ వేసినట్టు కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఎన్ఐఏ తరుపు న్యాయవాది చేసిన వాదనతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు షడ్యుల్ నేరాల క్రిందకు రాదని, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సి తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

hc 121122020 2

కేంద్రం హెం శాఖ నుంచి తమకు అనుమతి రావాలని, అనుమతి రాకుండా తాము విచారణ చేయలేమని కోర్టుకు చెప్పారు. దీని పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేవలం ఎఫ్ఐఆర్ చూసేసి, ఇవి షడ్యుల్ నేరాల క్రిందకు రావాలని ఎలా చెప్తారు అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ పోలీస్ ఆక్ట్ ప్రకారం నడుచుకునే సిబిఐ కూడా పరిమితులు ఉంటాయని, కానీ వారు తమ ఆదేశాలు పాటిస్తున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 226 ప్రకారం, మిమ్మల్ని దర్యాప్తు చేయమని చెప్పే హక్కు తమకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆగ్రహంతో ఎన్ఐఏ తరుపు న్యాయవాది స్పందిస్తూ, హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తే అవి పాటిస్తామని, ఏది చెప్తే అది చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇక మరో పక్క సిబిఐ తాము అఫిడవిట్ దాఖలు చేసామని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపింది. కౌంటర్ అఫిడవిట్ అందకపోవటంతో, అది జత చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, కేసుని నవంబర్ 18కి వాయిదా వేసింది. మరో పక్క తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు కొనసాగుతాయని తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read