ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గత కొన్ని నెలలుగా, ప్రభుత్వం చేస్తున్న అనేక రాజ్యాంగబద్ధ పనుల పై వివిధ వర్గాలు వేస్తున్న పిటీషన్ల పై, ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కేసుల్లో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది కూడా. హైకోర్ట్ ఆదేశాలు లెక్క చేయకపోవటం, మీ మీద కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు పెట్టకూడదు అని కూడా ప్రశ్నించి, ఆ దిశగా ఒక రెండు కేసుల్లో అడుగులు కూడా వేసింది. ఈ జాబితాలో చీఫ్ సెక్రటరీ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, కొన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే వీరిని కోర్టు హెచ్చరించింది కానీ, ఏనాడు వారికి శిక్షలు ఖరారు చేయలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ఏమో కానీ, కోర్టు చర్యలకు అయితే దిగలేదు. అయితే ప్రభుత్వ వైఖరి పై మాత్రం, అనేక సార్లు కామెంట్స్ అయితే చేసింది, అనేక మంది అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కూడా ఏకంగా ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అది కూడా విచారణలో ఉంది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే, ఈ మధ్య కాలంలో కేవలం హెచ్చరికలు వరుకే ఇస్తూ వస్తున్న హైకోర్టు చర్యలకు కూడా దిగింది. తమ ఆదేశాలు లెక్క చేయని అధికార పై కోర్టు ధిక్కరణ కింద కేసు తీసుకుని, ఏకంగా శిక్ష కూడా వేసేసింది.
వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా, ముసునూరు మండల తహశీల్దార్ టి.మదన్ మోహన్ రావు, హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే, ఓ భూమి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించటంతో, ఆయనకు హైకోర్టు రూ. 2 వేల జరిమానా విధించింది. ఒక వేళ ఆ సొమ్ము కనుక కోర్టుకు కట్టకపోతే, రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని, హైకోర్టు తమ తీర్పులో తెలిపింది. ఈ మేరకు, హైకోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఒక కేసు విషయంలో, హైకోర్టు ముందుకు విచారణకు వచ్చిన కేసులో, పిటీషనర్ తరుపున అసైన్డ్ భూమిని వెనక్కు తీసుకునే విషయంలో, తహశీల్దార్ టి.మదన్ మోహన్ రావు సరైన నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించినా, వాటిని అతిక్రమించినందుకు, తహశీల్దార్ పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన హైకోర్టు, విచారణ జరిపింది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసారని హైకోర్టు తెలిపింది. అయితే తనను క్షమించాలని కోరుత హశీల్దార్ కోర్టులో అఫిడవిట్ వేసి, మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవటంతో, హైకోర్టు సీరియస్ అయ్యి, ఆయనకు జరిమినా విధించింది.