15 రోజుల క్రితం, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయ్యి, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే, అనేకమంది అస్వస్తతకు గురయ్యారు. అయితే ఈ కంపెనీ విషయంలో, అనేక ప్రశ్నలు, అనేక ఆరోపణలు వస్తున్న వేళ, హైకోర్ట్ లో శుక్రవారం జరిగిన వాదనలు, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనం అయ్యాయి. ఈ రోజు ఆ ఆదేశాలకు సంబంధించి, పూర్తి డాక్యుమెంట్ బయటకు రావటంతో, కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన తరువాత, హైకోర్ట్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. ఈ విషయం పై శుక్రవారం హైకోర్ట్ కీలక ఆదేశాలతో పాటుగా, కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. ఇవే ప్రశ్నలు సామాన్య ప్రజలకు కూడా వచ్చాయి. మొన్న సిఐడి ఆర్రేస్ట్ చేసిన రంగనాయకమ్మ గారి కేసు విషయంలో కూడా, ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఈ రోజు కోర్ట్ కూడా అవే ప్రశ్నలు వేసింది.

ముందుగా కోర్ట్ ఆదేశాలు ఇస్తూ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చెయ్యాలని ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్ లతో, కంపెనీకి సంబంధించిన ఎవరూ లోపలకు వెళ్ళవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అలాగే విచారణ కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు అయ్యాయని, విచారణ కోసం వెళ్ళే వారు లోపలకు వెళ్ళవచ్చు కాని, గేటు బయట ఒక రిజిస్టర్ పెట్టి, ఎవరు ఎవరు లోపలకు వెళ్తున్నారో, వారు అక్కడ రిజిస్టర్ అవ్వాలని కోర్ట్ కోరింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి ఏ ఒక్కటీ, మిషనరీ కాని, ఫర్నిచర్ కాని, బయటకు వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్ లకు, కోర్ట్ కు తెలయకుండా పాస్ పోర్ట్ ఇవ్వకుడదు అని, ఎవరూ దేశం విడిచి వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశించింది.

అలాగే లాక్ డౌన్ తరువాత పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? ఒక వేళ పర్మిషన్ ఇవ్వకపోతే, ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కోర్ట్ కోరింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ విషయాల్లో ఎందుకు సరిగ్గా స్పందించ లేదు అంటూ కోర్ట్ అడిగింది. ఎల్జీ పాలిమర్స్, పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పని చేస్తుంది, అని కోర్ట్ ప్రశ్నించింది. కంపెనీలో అలారం ఎందుకు మోగలేదు అని ప్రశ్నించింది. ప్రమాదం జరిగితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే, ట్రైనింగ్ ఎందుకు ఇవ్వలేదు ? అని ప్రశ్నిస్తూ, కంపెనీ నెట్ వాల్యు ఎంత ? కోర్ట్ పరిధిలో ఉండగానే, స్టరీన్ మోనోమార్ ని సౌత్ కొరియాకి తరలించే ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? నేరం జరిగినాక ఎటువంటి మాజిస్టీరియల్ విచారణ కానీ ఇన్సెపక్షన్ టీం ఏర్పాటు కా కుండానే
ఎలా తరలించారు? అని కోర్ట్ ప్రశ్నిస్తూ, కౌంటర్ దాఖలు చెయ్యమని కోరింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read