ఒకే పత్రికకు, అదీ రాష్ట్ర అధినేతకు చెందిన పత్రికకు, అర్హత లేకపోయినా ఎక్కువ ప్రకటనలు ఇచ్చారంటూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ కేసు పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు రాష్ట్ర ఖజానా నుంచి ప్రకటనలు ఇచ్చారంటూ, పిటీషనర్ హైకోర్టులో కేసు దాఖలు చేసారు. అలాగే ఆ ప్రకటనల్లో కూడా వైసీపీ పోలిన రంగులు ఇస్తున్నారు అంటూ, తన పిటీషన లో పేర్కొన్నారు. అయితే ఈ పిటీషన్ ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ రాకేశ్‍కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన బెంచ్ ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే ఈ కేసు పై విచారణ చేయకుండా, ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చెయ్యాలని, ద్విసభ్య ధర్మసనం కోరింది. దీంతో ఈ కేసు చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్ళే అవకాసం ఉంది. త్వరలోనే దీని పై, విచారణ జరగనుంది. గత వారం ఒక సామాజిక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో ఇచ్చిన ప్రకటనల పై ఒక ఆర్టీఐ వేసింది. ఆ ఆర్టీఐలో ఈ ఏడాది కాలంలో వంద కోట్లు ప్రకటనలు పత్రికల్లో ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇందులో అర్హత లేకపోయినా సాక్షి దినపత్రికకు 52 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, అత్యంత పెద్ద సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకు మాత్రం, 35 కోట్లు ప్రకటనలే ఇచ్చారు. ఇక మూడో అత్యంత సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి మాత్రం అన్ని పత్రికల కంటే తక్కువగా, కేవలం లక్షల్లో ఇచ్చారు.

hc 31082020 2

అయితే అర్హత లేకపోయినా, సాక్షికి 50 శాతం పైగా ప్రకటనలు ఇచ్చారని, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. అత్యంత సర్క్యులేషన్ ఉన్న పేపర్ కి ఎక్కువ ప్రకటనలు ఇవ్వాలని, గతంలో కొన్ని జడ్జిమెంట్ లు ఉన్నాయని, పిటీషన్ లో తెలిపారు. సాక్షి పేపర్, ముఖ్యమంత్రికి చెందినది కాబట్టే, ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, అత్యంత ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకు తక్కువగా, మూడో సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి అన్నిటికంటే తక్కువగా ప్రకటనలు ఇచ్చారని, ఇవి రూల్స్ కి విరుద్ధం అంటూ పిటీషన్ లో తెలిపారు. అలాగే ఇస్తున్న ప్రకటనల్లో కూడా వైసీపీ పార్టీ జెండా రంగులు పోలిన ప్రకటనలు ఇస్తున్నారని, ఇది కూడా రూల్స్ కు విరుద్ధం అని పిటీషన్ లో తెలిపారు. గతంలో రంగులు విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రికి చెందిన సంస్థ ఉందనో ఏమో కానీ, ద్విసభ్య ధర్మాసనం, ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎప్పుడు విచారణకు వస్తుందో, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read