రాష్ట్ర హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానకి మరోసారి షాక్ తగిలింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 53, 54లను విడుదల చేసింది. ఈ రెండిటినీ సవాల్ చేస్తూ, ప్రభుత్వం స్కూల్స్, జూనియర్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, కాకినాడకు చెందిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం, రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై దాదాపుగా సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పిటీషన్ తరుపు న్యాయవాదులు, బలమైన వాదనలు వినిపించారు. పిటీషనర్ తరుపు శ్రీవిజయ్, ఆదినారాయణ రావు, మరి కొందరు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు సందర్భంగా ప్రధానంగా, ప్రైవేటు స్కూళ్లు, జూ.కాలేజీలకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని చెప్పి, కూడా ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే, హైకోర్టు ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. జీవో 53, 54ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా, ప్రైవేటు స్కూళ్లు, జూ.కాలేజీలు, ఈ రెండిటికీ ఫీజులు మీరు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించటంతో పాటు, ప్రైవేటు స్కూళ్లు, జూ.కాలేజీలకు బస్సు ఫీజులను కూడా ప్రభుత్వం నిర్ణయించం ఏమిటి అని ప్రశ్నించారు.

hc 27122021 2

బస్సు ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, జీవోలో పెట్టటం పై, రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. కొంత మంది విద్యార్ధులు సైకిల్ మీద, సొంత వాహనాలతో వస్తారు, అలాంటిది బస్సు ఫీజులు మీరు ఎలా నిర్నయస్తారని ప్రశ్నించింది. అదే విధంగా ఈ జీవోని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, జూనియర్ కాలేజీలకు కూడా వర్తిస్తాయని కూడా తమ తీర్పులో హైకోర్ట్ స్పష్టం చేసింది. ఇక అదే అంశం పై, ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశిస్తూ, వెంటనే ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ కూడా ఈ అంశం పైన దాఖలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సినిమా టికెట్ల రచ్చ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు సమస్యలు అయిన కరెంటు బిల్లులు, అలాగే ఇంటి పన్నులు, పెట్రోల్ రేట్లు ఇలాంటివి తగ్గించకుండా, ఎవరినో సాధించటానికి, అన్ని విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, అభాసుపాలు అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read