ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్ట్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముందు రద్దు చేస్తామని, ఆ తరువాత ఈ ధరలు సమీక్షిస్తామని చెప్పటమే కాకుండా, ఆ ధరలు తగ్గించాలని, గత ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాలను తిరగదోడటంతో, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర హైకోర్టుని రెండేళ్ళ క్రితం ఆశ్రయించారు. అయితే మొదటగా ఈ కేసు సింగల్ జడ్జి ముందుకు వెళ్ళింది. అక్కడ సింగెల్ జడ్జి తీర్పు ఇస్తూ, సోలార్ పవర్, విండ్ పవర్ కి, ఇంత చొప్పన ప్రభుత్వం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. దీని పైన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, అది తమకు నష్టం చేకూరుస్తుంది అంటూ, రాష్ట్ర హైకోర్టు డివిజినల్ బెంచ్ ని ఆశ్రయించారు. డివిజినల్ బెంచ్, కొద్ది సేపటి క్రితం తీర్పు ఇచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. అంతే కాదు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్న సంస్థలు, ఎంత మేరకు ఒప్పందం చేసుకున్నాయో, ఆ రేటు ప్రకరామే వారికి చెల్లింపులు చేయాలని తీర్పు ఇచ్చింది. అంటే సోలార్ పవర్ యూనిట్ కి రూ.4.80 పైసలకు, విండ్ పవర్ ని యూనిట్ కు రూ.4.83 పైసలకు చెల్లించి తీరాల్సిందే అని కూడా, హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఏపి లోడ్ డిస్పాచ్ సెంటర్ వేసిన పిటీషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

hc 16032022 2

దీంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించకుండా, జాప్యం చేస్తుందని, దీని వల్ల సోలార్, విండ్ విద్యుత్ ను ఉత్పత్తి చేసే సంస్థలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి అని, ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోతున్నాయని, దీంతో పాటు, ఎవరు అయితే పని చేస్తున్నారో, వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి, ఆ కంపెనీలు వెళ్లాయని, ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో పిటీషన్ వేసాయి. ఈ పిటీషన్ వేసిన నేపధ్యంలో హైకోర్టు నిన్న సంచలమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పులో, ఆరు వారాల్లోగా బకాయలు అన్నీ చెల్లించాల్సిందే అని కూడా, ఆదేశాలు ఇచ్చింది. ఇవి దాదాపుగా 20 వేల కోట్ల వరకు ఉంటాయి. మరి ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితిలో అంత డబ్బు ఎలా వస్తుందో చూడాలి. అదే విధంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థలు రెండూ కూడా, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని సమీక్షించాలని వేసిన పిటీషన్ ను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు 20 వేల కోట్లు తేవాలి అంటే, జగన్ ప్రభుత్వానికి అదిరిపోయే జర్క్ అనే చెప్పాలి. మరి ప్రభుత్వం చేల్లిస్తుందో, లేక కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read