ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి, మరో సీనియర్ అధికారికి షాక్ ఇచ్చింది. గతంలో అనేక సార్లు అధికారులకు, హైకోర్టు దగ్గర మొట్టికాయలు పడినా మారటం లేదు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోవటంతో, పదే పదే అధికారులు, హైకోర్టు చేత చీవాట్లు తింటున్నారు. ఇది కావాలని చేస్తున్నారో, లేక పొరపాటున చస్తున్నారో కానీ, ప్రతి సారి ఇదే తీరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు చేతిలో ఈ రోజు మొట్టికాయలు పడ్డాయి. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందు వచ్చి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖపట్నం జిల్లాలో, వార్డు, అలాగే గ్రామ సచివాలయాలకు, కొంత మంది స్టేషనరీ కిట్స్ సప్లై చేసారు. అయితే ఆ బిల్లులు ఇవ్వటం లేదు. దీంతో ఈ విషయం పై హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే వారికి నగదు చెల్లించాలని, రెండేళ్ళ క్రిందటే హైకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. దీంతో మళ్ళీ హైకోర్టులో పిటీషన్ వేసారు. పిటీషనర్ తరుపు వాదనలు విన్న హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా కౌంటర్ దాఖలు చేయకపోవటంతో, హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈనెల 13న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందుకు రావాలని కోర్టు సీరియస్ అయ్యింది.
ఏపి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి షాక్ ఇచ్చిన హైకోర్టు...
Advertisements