న్యాయమూర్తుల పై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసు, ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభావించటమే కాకుండా, సిబిఐ అనుసరిస్తున్న తీర్పు పై హైకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న పంచ్ ప్రభాకర్, న్యాయమూర్తులు అదే విధంగా హైకోర్టు పై కూడా ప్రతి రోజు వీడియోలు పోస్ట్ చేస్తూ, దారుణమైన భాష వాడుతున్నారని, ఇది సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని, ఈ అంశాన్ని పలు మార్లు సిబిఐ దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ, సిబిఐ అతనికి కనీసం ఒక నోటీసు కూడా ఇవ్వలేక పోయింది అంటూ, అశ్వినీ కుమార్ హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానించింది. ఎన్ని సార్లు ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని అశ్వనీ కుమార్ ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేక పోయారని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

cbi 28102021 2

వెంటనే రేపు ఉదయం సిబిఐ ఎస్పీని తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపు పంచ్ ప్రభాకర్ పై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, దానికి సంబంధించిన వివరాలు కూడా హైకోర్టు ముందు ఉంచాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అలాగే ఈ అభ్యంతరకర పోస్టింగ్ లు తొలగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ, హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఎందుకు చర్యలో తీసుకోలేక పోతున్నరాక్ చెప్పాలని కోరింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు నోటీసులు ఇచ్చామని చెప్పి, పంచ్ ప్రభాకర్ చేసిన వీడియోలు తొలగించాలని చెప్పి , ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు అశ్వనీ కుమార్ సూచించారు. ఇదే సమయంలో సిబిఐకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు ఒక లేఖ రాస్తే, ఆ వీడియోలు తొలగిస్తారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు కూడా ఈ విధంగా ఆదేశించింది. ఈ కేసుని రేపు ఉదయానికి పోస్టింగ్ చేస్తున్నామని, రేపు ఉదయం సిబిఐ ఎస్పీ తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read