కోర్టుల వ్యవహరంలో వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అధికారులు తీరు ఇందులో గమనించాల్సిన అంశం. ప్రభుత్వ పెద్దలు చేసే పనులకు, అధికారులు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా వచ్చినా, వైసీపీ పెద్దలకు ఏమి ఇబ్బంది ఉండదు కానీ, అధికారులు మాత్రం బలి అయిపోతున్నారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, కింద స్థాయి అధికారులు వరకు, హైకోర్టు ఆగ్రహానికి గురి అయిన వారే. ప్రతి రోజు అధికారుల పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే కేసులు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య అధికారులు పై నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఫైన్లు, శిక్షలు కూడా చూస్తున్నాం. అయినా అధికారులు మాత్రం ప్రతి రోజు బలి అవుతూనే ఉన్నారు. ప్రభుత్వం చేసే పనులకు అధికారులు ఇరుక్కుంటున్నారు. అటు ప్రభుత్వానికి చెప్పలేక, ఇటు కోర్టుల ముందు దోషులుగా నిలబడుతున్నారు. తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయి, నోటీసులు తీసుకుని కూడా, అధికారులు విచారణకు హాజరు కాకపొతే, వాళ్ళు ఎంత పెద్ద అధికారి అయినా సరే, వారి పైన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తాం అంటూ, హైకోర్టు హెచ్చరించిది. ఈ తరహా ఘటనలు ఉపేక్షించం అని, హైకోర్టు గురువారం హెచ్చరికలు జారీ చేసింది.

rawat 30102021 2

కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకుని కూడా విచారణకు హాజరుకాకపోతే, అది కోర్టులను మరింతగా కించపర్చడమేనని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేసు విషయంలో, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌.ఎస్‌ రావత్ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు అందుకుని, విచారణకు హాజరు కాకా పోగా, విచారణ సమయంలో న్యాయవాదిని కూడా నియమించకపోవటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసి, రూ.5లక్షల పూచీకత్తు ఇవ్వాలి అంటూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ న్యాయవాది వెంటనే కోర్టు ముందు హాజరు అయ్యి, కోర్టుకు క్షమాపణలు చెప్పారు. వేరే కేసు విచారణ జరుగుతుంది కాబట్టి, హాజరుకాక పోయాం అని, క్షమాపణ కోరటంతో, కోర్టు ఆదేశాలు వెనక్కు తీసుకుంది. కౌంటర్ దాఖలు చేయలని ఆదేశించింది. అయితే అధికారులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఈ విషయం చూస్తే అర్ధం అవుతుంది. అనేక కేసులు ఉండటంతో, ఏ కేసు ఎప్పుడు ఉందో కూడా, ఫాలో అప్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, అధికారులు మీద జాలి పడాల్సిన అంశం అని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read