ఈ రోజు హైకోర్టులో జగనన్న విద్యా దీవెన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కొన్ని కాలేజీలు, ఈ విద్యా దీవెన నిధుల పై పిటీషన్ వేసాయి. దీని పై ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ పై గతంలోనే విచారణ జరగగా, ఈ రోజు ఈ పిటీషన్ కు సంబంధించిన తీర్పు కాపీలు బయటకు వచ్చాయి. ఈ పిటీషన్ లో ప్రధానంగా ఉన్న అంశం ఏమిటి అంటే, కాలేజీలకు చాలా మంది ఫీజులు కట్టటం లేదని, ప్రభుత్వం ఆ ఫీజులను కాలేజీలకు ఇవ్వకుండా, విద్యార్ధుల తల్లి ఎకౌంటులో వేస్తుందని, అక్కడ తల్లి నుంచి కాలేజీలకు కట్టుకోవలని చెప్పగా, చాలా మంది ఫీజులు కట్టటం లేదని, కాలేజీలు దీని పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో లాగా నేరుగా తమకే ప్రభుత్వం ఆ ఫీజు డబ్బులు ఇవ్వాలి అంటూ, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దీని పై విచారణ చేసిన హైకోర్టు, కాలేజీల ఎకౌంటులోనే ఫీజు జమ చేయాలి అంటూ, తీర్పుని ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం విద్యార్ధులకు విడుదల చేసిన ఈ ఫీజులు, కాలేజీలకు చేరటం లేదు అంటూ, కృష్ణదేవరాయ విద్యాసంస్థల తరపున హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసి, తమ వాదనలు వినిపించారు. దీంతో పిటీషనర్ వాదనతో హైకోర్టు ఏకీభావించింది.
ఇక ఈ పిటీషన్ పై ప్రభుత్వం తరుపున కూడా వాదనలు వినిపిస్తూ, తాము తల్లులకు ఇస్తున్నాం అని, వారు కట్టక పొతే తాము ఏమి చేయలేం అని, ఆ విషయంలో తాము కలుగ చేసుకోలేం అని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెండు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం, ప్రభుత్వం కూడా తాము ఏమి చేయలేం అని చేతులు ఎత్తేయటంతో, ఫీజులు కట్టకుండా కుదరదు అని, ఆ ఫీజులు అన్నీ ప్రభుత్వం నేరుగా, కాలేజీల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. నేరుగా కళాశాలల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి అంటూ తీర్పుని ఇచ్చింది. ఈ ఆర్డర్ కి సంబంధించిన కాపీ, ఈ రోజు బయటకు వచ్చింది. దీంతో ఇన్నాళ్ళు కాలేజీలకు ఫీజులు కట్టకుండా, నేరుగా తల్లుల ఖాతాలో వేసి, దీన్ని కూడా ఓటు బ్యాంకు పధకంగా చూపించుకోవాలని చూసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది అనే చెప్పాలి. అసలు నేరుగా కాలేజీలకు ఇన్నాళ్ళు ప్రభుత్వాలు వేస్తుంటే, దాన్ని తల్లులు ఖాతాలో వేయటం, ఇదేదో కొత్త పధకంగా బిల్డ్ అప్ ఇవ్వటం తెలిసిందే.