మాజీ మంత్రి వివేక కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అంటూ గతంలో దస్తగిరి, సిఐ శంకరయ్య,ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ బయటకు రావటంతో, ఈ కేసులు దర్యాప్తుకు సంబంధించి, అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉదయ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తనను సిబిఐ వాళ్ళు వేధిస్తున్నారు అంటూ, ఈ నెల 15వ తేదీన కడప పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు చేసిన అనంతరం అతను నేరుగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కూడా తెలిసిన విషయాలు అన్నీ చెప్పినా కూడా, సిబిఐ అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు అంటూ, కడప కోర్టులో పిటీషన్ వేసారు. అయితే అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్తూ, కడప పోలీసులు, వివేక కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్పీ స్థాయి అధికారి రామ్‍సింగ్‍పై కడప పోలీసులు కేసు నమోదు చేసి, FIR కూడా నమోదు చేసారు. ఈ నేపధ్యంలోనే ఈ FIR పైన సిబిఐ రాష్ట్ర హైకోర్టు ని ఆశ్రయించింది. ఈ విధంగా దేశంలో, దర్యాప్తు చేస్తున్న ఒక అధికారి పైనే ఏకంగా కేసు నమోదు చేయటం అనేది కరెక్ట్ కాదు అంటూ, సిబిఐ తరుపు న్యాయవాది హైకోర్టులో గట్టి వాదనలు వినిపించారు. ఈ వాదనల నేపధ్యంలోనే హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.
ఇందులో ప్రధానంగా, ఈ కేసుకు సంబంధించి, ఎలాంటి చర్యలు ఉండకూడదు అంటూ సిబిఐ స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాలు మేరకే, తాము కేసు నమోదు చేసామని కడప పోలీసులు చెప్తూ ఉండటంతో, ఈ కేసుకు సంబంధించి, పూర్తి వివరాలు కూడా హైకోర్టుకు ఇవ్వాలని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా దర్యాప్తు అధికారి అయిన రామ్‍సింగ్‍పై కేసు నమోదు చేయటం పట్ల సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేసాం అని చెప్తున్నా, అందులో పేర్కొన్న సెక్షన్లు ఏవి అయితే ఉన్నాయో, ఆ సెక్షన్లు కూడా అసమంజసంగా ఉన్నాయని, న్యాయవాదులు వాదించారు. ఈ నేపధ్యంలోనే, ఒక కీలక అధికారి మీద, అదీ ఒక క్రైమ్ కేసు దర్యాప్తు అధికారి మీద, ఇలా కేసులు పెట్టటం, దేశంలోనే సంచలనంగా మారింది. దీంతో హైకోర్టు ఈ కేసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిబిఐ అధికారి పైన పెట్టిన కేసు విషయంలో, ఎలాంటి చర్యలకు ముందుకు వెళ్లొద్దు అంటూ, ఆదేశాలు జారీ చేసింది.