ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములు, ఇళ్ళ పట్టాలకు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, హైకోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై స్టే ఇచ్చింది. 1922లో తెలుగు, సంస్కృతం అభివృద్ధి, వైశ్య పేద మహిళలకు సహాయం చెయ్యటం కోసం, ఈ వైశ్య సేవా సదన్ ఏర్పడినట్టు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు న్యాయవాది. వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వ నిర్ణయం పై స్టే ఇచ్చింది. అలాగే వైశ్య సేవా సదన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ నాటికి కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. పిటీషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, కేసు వివరాలు చెప్పారు ఆయన మాట్లాడుతూ, రాజమహేంద్రవారంలో, 1922లో ఏర్పాటు చేసారని, ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, వంటకు సంబంధించి, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక విద్యలు ఇలాంటివి నేర్పాలి, ప్రత్యేకించి వైశ్య మహిళలకు నేర్పాలని ఇది స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా, దాదాపుగా 500 ఎకరాల భూముల్లో అనేక భావనను, కాలేజీలు, గుడిలు ఇవన్నీ ఏర్పాటు చేసారు. వీటి పై వచ్చిన ఆదాయంతోటి, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
అయితే దీనికి సంబందించిన 32 ఎకరాల భూమిని, ప్రభుత్వం ఇళ్ళ స్థాలలాకు తీసుకోవటానికి మొదలు పెట్టిందని, ఈ సందర్భంగా మార్చ్ 16 వ తేదీన ఎన్డౌమెంట్స్ కమిషనర్ గారు, ఈ భూములు తీసుకోవటానికి వీలు లేదని, హైకోర్టు తీసుకోవద్దని చెప్పిందని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ కూడా రాసారని తెలిపారు. ఇన్ని వివరాలు ఇచ్చినా, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ముందుకు వెళ్తున్నారని, అందుకే స్థానికంగా ఉన్న ఒక పెద్ద మనిషి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారని, ఈ రోజు అది కోర్టు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఇది రావటంతో, హైకోర్టు అన్నీ పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వ నిర్ణయం పై స్టే ఇచ్చిందని, అలాగే వైశ్య సేవా సదన్ కు కూడా నోటీసులు ఇచ్చి, కేసుని అక్టోబర్ నెలకు వాయిదా వేసిందని చెప్పారు. దేవాదాయ భూములు తీసుకుంటామని, ప్రభుత్వం చెప్పటం అన్యాయం అని, ప్రభుత్వం దేవాలయ భూముల జోలికి రాకుండా, చూసుకోవాలని పిటీషనర్ తరుపు న్యాయవాది తన అభిప్రాయాన్ని తెలిపారు.