రాజధాని అమరావతి విషయంలో, ప్రభుత్వం మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకోవటం, తమ భూములు రాజధానికి ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టటం, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఈ కేసుల విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొత్తగా ఏర్పడిన త్రిసభ్య ధర్మాసనం ముందు, ఈ రోజు విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ గోస్వామి, జస్టిస్ బాగ్చి, జస్టిస్ జయసూర్య, ఈ ముగ్గురి ధర్మాసనం ముందు, రాజధాని కేసులు విచారణకు సంబంధించి, విచారణ ఎప్పుడు ఖరారు చేయాలి అనే అంశం పై, అటు ప్రభుత్వం తరుపు న్యావాదులు, ఇటు రైతులు తరుపు న్యాయవాదులతో ఈ రోజు చర్చించారు. గతంలో ఈ కేసులుకు సంబంధించి, ఇటు ప్రభుత్వం తరుపు నుంచి, అటు రైతులు తరుపు నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో, అప్పట్లో చీఫ్ జస్టిస్ గా ఉన్న మహేశ్వరీ బదిలీ కావటంతో, ఈ కేసులు విచారణ అప్పట్లో నిలిచి పోయింది. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త బెంచ్ ఈ కేసులు విచారణ చేయనుంది. అయితే ఈ కేసులు విచారణ త్వరగా చేసి, తొందరగా తీర్పు తెచ్చుకుని, తొందరగా వైజాగ్ వెల్లిపోదాం అని చూస్తున్న ప్రభుత్వానికి, ఈ రోజు హైకోర్టు నిర్ణయం షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
ఈ రోజు సమావేశం అయిన త్రిసభ్య ధర్మాసనం, ఈ కేసుని మళ్ళీ మొదటి నుంచి వింటాం అంటూ, ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఈ విచారణ మొత్తం మళ్ళీ రెండు మూడు నెలలు కొనసాగే అవకాసం ఉంది. మళ్ళీ మధ్యలో వేసవి సెలవు ఉండనే ఉంటాయి. ఇక సెకండ్ వేవ్ ప్రభావం కూడా ఈ కేసులు పై పడే అవకాసం ఉంది. మొత్తంగా మే 3 నుంచి రోజు వారీ విచారణ చేస్తాం అని కోర్టు అంటుంది. ఈ విచారణ పూర్తి అవ్వాలి అంటే, ఆగష్టు, సెప్టెంబర్ వరకు అయ్యే అవకాసం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులు తొందరగా విచారణ చేయాలని ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ , కోర్టుని అభ్యర్ధించటంతో, ఈ రోజు కోర్టు విచారణ చేసి, ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మే 3 నుంచి రోజు వారీ విచారణ ఉంటుందని కోర్టు చెప్తుంది. అయితే మధ్యలో వేసవి సెలవులు కూడా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఈ ప్రతిష్టంభన తొందరగా తోలిగిపోతే, ఇటు రైతులుకాని, అటు ప్రభుత్వం కాని, ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంటుంది. ఏది ఏమైనా అమరావతి అనేది వర్ధిల్లాలి అని, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్దాం అని కోరుకుందాం.