ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు, అధికారులు రూల్ అఫ్ లా పాటించకుండా చేస్తున్న పనులకు, న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. అయినా కొంత మంది మారటం లేదు. ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక అయుదు ఆరు సార్లు అయినా హైకోర్టు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా తీవ్ర పదజాలంతో, ఆధికారులు చేస్తున్న తప్పులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా మార్పు మాత్రం రావటం లేదు. ఈ నేపధ్యంలోనే మళ్ళీ హైకోర్టులో , ఏపి అధికారులకు షాక్ తగిలింది. ఈ సారి ఏకంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు హైకోర్టు శిక్ష వేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం అనే చెప్పాలి. వారం క్రితం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు తొమ్మిది రోజులు శిక్షతో పాటుగా, వెయ్యి రూపాయాల జరిమానా విధించింది. అయితే తమ పై మానవత్వం చూపాలని, ఇన్నాళ్ళు తాము చేసిన సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలని వీరు కోరటంతో, హైకోర్టు స్పందిస్తూ, జైలు శిక్షను తీసి వేసి, కోర్టు పనిగంటలు ముగిసే వరకు కూడా కోర్టులోనే ఉండాలని, అదే విధంగా వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని శిక్ష విధించింది. జరిమానా కట్టకపోతే మాత్రం, మూడు రోజులు జైలు శిక్ష వేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తో పాటుగా, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఈ శిక్ష విధించింది హైకోర్టు. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి జనవరి 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రక్రియ మొత్తం మధ్యలో ఉండగా, నిబంధనలు మార్చేసారు. ఇలా ఎందుకు మార్చారో తెలియరు. అయితే దీని వల్ల ఇబ్బందులు పడ్డ 36 మంది హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేసి, నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసి, ఈ 36 మందిని కూడా ఆ పోస్టుల్లో భర్తీ చేసే అవకాసం కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాకపోవటంతో, అభ్యర్ధులు మళ్ళీ కోర్టుకు వచ్చి కోర్టు దిక్కరణ పిటీషన్ వేసారు. దీంతో ఇది విచారణ జరిపిన కోర్టు, తాము ఆదేశాలు ఇచ్చినా, కావాలనే ఉత్తర్వులు అమలు చేయనట్టు అర్ధం అవుతుందని, అందుకే కోర్టు దిక్కరణ నేరంక్ కింద ఇద్దరు అధికారులకు శిక్ష విధించారు.