ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జగన్ మీడియా పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షి మీడియాలో హైకోర్టు, సుప్రీం కోర్టు గురించి వ్యాఖ్యలు చేసింది అంటూ, ప్రచురించిన కధనం పై హైకోర్టు అసంతృప్తి తెలిపింది. విచారణకు సంబంధం లేని విషయాలు, ప్రస్తావిస్తూ హైకోర్టుని ఎలా లాగుతారు అంటూ, అడ్వకేట్ జనరల్ దృష్టికి ఈ అంశం తీసుకొచ్చింది. దీని పై స్పందించిన అడ్వకేట్ జనరల్, ఈ కధనం పరిశీలించి చెప్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, మిస్ రిపోర్ట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. అయితే ఇదే సమయంలో మరో న్యాయవాది అయిన నాగిరెడ్డి కలుగ చేసుకుని, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అంటూ, ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఒక తప్పుడు కధనం రాసింది కదా, ఇది కూడా న్యాయస్థానికి సంబంధించిన వార్తలే అని, ఇవి కూడా తప్పుగా ప్రచురితం అవుతున్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయం ఇప్పటికే కోర్టు పరిధిలో విచారణలో ఉందని, ఆ విచారణ అయ్యేంత వరకు, దాని పై స్పందించం అని కోర్టు స్పష్టం చేసింది.

ఇక నిన్నటి నుంచి అమరావతి కేసుల్లో రోజు వారీ విచారణ ప్రారంభం అయ్యింది. దాదాపుగా ఉన్న 230 కేసులను, 18 విభాగాలుగా హైకోర్టు విభజించింది. ఇప్పటికే ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. చాలా కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడ్డాయి. మరికొన్ని కేసులను మెయిన్ బెంచ్ నుంచి తప్పించి, వేరే డివిజన్ బెంచ్ కు బదిలీ చేసారు. నిన్న ముఖ్యంగా సియం క్యాంప్ ఆఫీస్ పై చర్చ జరిగింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు పిటీషన్ లో, అడ్వకేట్ జెనెరల్ స్పందిస్తూ, ఏ కార్యాలయం తరలించే ఉద్దేశం లేదని, క్యాంప్ కార్యాలయం మాత్రం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పటంతో, క్యాంప్ కార్యాలయాల పై వివరాలు కోర్టు అడిగింది. ఇక సెలెక్ట్ కమిటీ, మండలిలో జరిగిన చర్చకు సంబంధించి, పూర్తి వివరాలు కోర్టు అడిగింది. సిఆర్డీఏ కొనసాగుతుందని, అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ పై ఇక నుంచి ఎలాంటి కార్యకలాపాలు చెయ్యకూడదు అని, దీని పై కూడా స్టేటస్ కో ఇచ్చింది. ఇలాగే అనేక కేసుల పై నిన్న విచారణ జరిగింది. ఈ రోజు మరి కొన్ని కేసుల పై విచారణ జరగనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read