ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా ? ఇప్పటికే అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. అయినా మీ తీరు మారలేదు. మీ తీరుతో ప్రభుత్వానికి నష్టం. చేతకాక పొతే రాజీనామా చెయ్యండి అంటూ హైకోర్టు డీజీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కేసు పై, వెంకటరాజు మేనమామ, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది. అమలాపురంలో అక్రమంగా ఒక వ్యక్తిని నిర్బంధించారు. వైజాగ్ లో కేసుకు సంబంధించి ఆచూకీ చెప్పాలి అంటూ, అమలాపురంలో ఉన్న వ్యక్తిని నిర్బంధించటంతో, వాళ్ళు హైకోర్టులో పిటీషన్ దాఖలు చెయ్యగానే, ఇతన్ని విడుదల చేసారు. అయితే ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో, ఏమి జరుగుతుంది ? గతంలో ఇలాంటి పిటీషన్లలోనే రాష్ట్ర డీజీపీ హైకోర్టు ముందు హాజరు అయ్యి, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేస్తానాని, హామీ ఇచ్చారని, అయితే తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరగటం ఏమిటి అంటూ, హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితితులు రాష్ట్రంలో సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మా దగ్గరకు వచ్చే ప్రతి కేసుని సిబిఐ ఎంక్వయిరీకి ఇచ్చే పరిస్థితి ఉండదని, హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి పరిస్థీతులు రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి అంటూ, గతంలో జరిగిన అన్ని సంఘటనలు కోర్టు గుర్తుకు చేసింది. ఇటువంటి పరిస్థితి సరైనది కాదని, మీ తీరుతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో విచారణ జరిగిన ప్రతి సారి పోలీసులదే తప్పని తేలిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుంది అంటూ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపిలో రూల్ అఫ్ లా అమలు కావటం లేదని, పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేయలేకపొతే, డీజీపీ రాజీనామా చేసి బాధ్యతలు నుంచి తప్పుకోవచ్చని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ పరిణామం పై పోలీస్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. రాజకీయంగా కూడా, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారని, అనేక ఆరోపణలు గతంలో వచ్చాయి. మరి ఇంత ఘాటుగా స్పందించిన తరువాత అయినా, పోలీస్ వ్యవస్థ మారుతుందో లేదో చూడాలి.