ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు, ఇయర్ ఎండింగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఈ రోజు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విషయంలో, 2017లో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయక పోవటం పై, ఆయన పై కోర్టు దిక్కరణ కేసు నమోదు కావటం, గత వారం హైకోర్టు కూడా ఈయన కేసు ధిక్కరణకు పాల్పడ్డారని భావించి, ఈ నెల 31 తేదీన హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని, ఆ రోజు శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు చెప్పింది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు, రాష్ట్ర హైకోర్టుకు హాజరు అయ్యారు. ఈ రోజు మధ్యానం నుంచి సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు, కోర్టులోనే కూర్చోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయనందుకు, ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించక పొతే, వారం రోజులు సాధారణ జైలు శిక్ష కూడా అనుభవించాలని ఆదేశాలు జారీ చేసింది. కొద్ది సేపటికి కింద ఈ ఆదేశాలు వచ్చాయి. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు ఆయన కోర్టులోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం, ఆయన వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించకపోతే మాత్రం, వారం రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు ఈ వ్యవహారం హైకోర్టులో సంచలనం సృష్టించింది.

hc 3112020 2

ఈ రోజు చీఫ్ జస్టిస్ మహేశ్వరి బదిలీ ఉత్తర్వులు రావటం, ఇదే రోజు జస్టిస్ రాకేశ్ కుమార్ కూడా రిటైర్డ్ అవుతూ ఉండటంతో, ఈ నేపధ్యంలో ఈ తీర్పు రావటంతో, అటు హైకోర్టు న్యాయవాదులు మధ్య, అసెంబ్లీ వర్గాల మధ్య ఈ తీర్పు సంచలనంగా మారింది. అయితే ఈ శిక్ష తక్కువగా కనిపించినా, కోర్టు శిక్షలు ఇలాగే ఉంటాయి. కానీ అధికారులకు మాత్రం, ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఇక ఈ రోజు మరో కేసులో హైకోర్టు టిటిడి ఉద్యోగులు చేసిన పాడు పని పై సీరియస్ అయ్యింది. టిటిడి ఉద్యోగులు కొంత మంది పో-ర్న్ లింక్స్ చూస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఎస్వీబీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే తమకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసారు అంటూ, వారు హైకోర్టుకు వెళ్ళారు. అయితే ఉద్యోగులు తీర్పు పై హైకోర్టు మండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం సమర్ధిస్తూ, ఉద్యోగులు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. మొత్తానికి ఈ ఏడాది, సంచలనాలతో వార్తల్లో నిలిచిన హైకోర్టు, ఈ ఏడాది చివరి రోజు కూడా అలాగే ముగించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read