గన్నవరం సమీపంలో, అతి పెద్ద ఐటి కంపెనీ హిందుస్తాన్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌సీఎల్), తమ కార్యకలాపాలని మే నెల నుంచి ప్రారంభించనుంది.. గన్నవరంలని మేధా టవర్స్ లో, హెచ్‌సీఎల్ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.. గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా, ఆర్టీసీ జోనల్ కాలేజీ స్థలంలో, హెచ్‌సీఎల్ శాశ్వత భవనాలకు కూడా మే నెలలోనే భూమిపూజ జరగనుంది. ఒకే రోజు, అటు శాశ్వత భవనాలకు భూమి పూజ, మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలు పెట్టటానికి, హెచ్‌సీఎల్ సిద్ధమైంది.. ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాలకు చెందిన 27 ఎకరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సీఎల్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ భూమిలో, చెట్ల తొలగింపు, నేల చదును పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఈ పనులు అన్నీ మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, వెంటనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెడతామని, చెప్తున్నారు... ఇక్కడ నిర్మించే ఐటి టవర్ నిర్మాణానికి, సంవత్సరం దాకా పడుతుంది అని, అందుకే మేధా టవర్స్ లో, కార్యకలాపాలు కూడా మొదలు పెట్టనుంది... ఒక వైపు టవర్ నిర్మాణ పనులతో పాటే మరోవైపు మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది... దీని కోసం, మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.. ఇప్పటికే, ఇక్కడ ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి... ఐటి టవర్ భూమి పూజ, మేధాలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్ పూనుకుంది. మే రెండో వారంలో కానీ, మూడో వారంలో కాని, ఇవి మొదలు కానున్నాయి...
కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్ ప్రణాలికలు రూపొందిస్తుంది...