ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హెచ్ సీఎల్ కల మరికొద్దీ రోజులలో సాకారం కాబోతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అభిముఖంగా మేధ టవర్స్ లో, సెప్టెంబర్ 13న హెచ్ సీఎల్ సంస్థకు చెందిన సోదర సంస్థ స్టేట్ స్ట్రీట్ హెచ్ సీఎల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 900 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఇది పూర్తిగా సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సంస్థ. ఈ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు రాకను దృష్టిలో ఉంచుకుని హైటెక్ సిటీ ముస్తాబౌతోంది.

hcl 01092018 2

ప్రధాన గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాన్ని ఆధునికీకరించారు. హైవే - 16 వెంబడి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో పైలాన్ ను ఏర్పాటు చేశారు. హెచ్ సీఎల్ సంస్థ మేధ టవర్లో తన సోదర సంస్థ కోసం 900 సీట్ల ఆక్యుపెన్సీ ఉన్న స్థలాన్ని తీసుకుంది. పూర్తిగా మేధ టవర్లో ఒక బ్లాక్ అన్నమాట. దాదాపుగా నాలుగునెలలుగా మేధ టవర్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి. స్టేట్ స్ట్రీట్ కార్యకలాపాలు నిర్వహించటానికి వీలుగా అధికారుల
ఛాంబర్లు, సమావేశపు హాల్, వర్కింగ్ గ్రూప్లతో పాటు సిబ్బందికి రెస్ట్ రూమ్స్ వంటివి కూడా ఏర్పాటయ్యాయి.

hcl 01092018 3

హెచ్ఎల్ ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలిపేందుకు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా సమయం ఉండటం వల్ల అధికారికంగా తర్వాత ప్రకటిద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. హెచ్ సీఎల్ సంస్థకు గన్నవరంలోని ఆర్టీసీ జోనల్ డ్రైవింగ్ కాలేజీకి చెందిన 21 ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ, హెచ్ సీఎల్ సంస్థల మధ్య సేల్ డీడ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ స్థలాన్ని హెచ్ స్పీల్ అధికారులు చదును చేశారు. ఇక్కడ
టెక్నాలజీస్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇక్కడ హై రైజ్ భవనం నిర్మించిన తర్వాత స్థానికంగా ఉన్న పట్టభద్రులకు ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తుంది.

hcl 01092018 4

ప్రస్తుతం మేథ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించే తన సోదర సంస్థలో మాత్రం పాత ఉద్యోగులే ఉంటారని సమాచారం. హెచ్ సీఎల్ సోదర సంస్థ మేధలో కాలు పెట్టనుండటంతో ఐటీ పార్క్కే కళ వచ్చింది. మేధ టవర్ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్ ఐటీ కంపెనీగా స్టేట్ స్ట్రీట్ ' సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసరపల్లికి మహర్దశ పట్టుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read