గన్నవరం సమీపంలో, అతి పెద్ద ఐటి కంపెనీ హిందుస్తాన్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌సీఎల్), తమ కార్యకలాపాలని మరో పది రోజుల్లో ప్రారంభించనుంది.. గన్నవరంలని మేధా టవర్స్ లో, హెచ్‌సీఎల్ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.. ‘మేథ’ టవర్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సేవలను ప్రారంభించటానికి హెచ్‌సీఎల్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించటానికి హెచ్‌సీఎల్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్‌సీఎల్ బ్లాకులో గత కొద్దినెలలుగా ఇంటీరియర్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. పూర్తయిన ఇంటీరియర్ పనులను హెచ్‌సీఎల్ బృందం పరిశీలించింది.
గన్నవరంలోని ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాలకు చెందిన 27 ఎకరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సీఎల్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ భూమిలో, చెట్ల తొలగింపు, నేల చదును పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టు ఉండటం వల్ల డిజైన్లకు కేంద్రం నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున ఇక్కడ శంకుస్థాపన, హైరైజ్ భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘మేథ’ టవర్‌లో తాత్కాలికంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్ నిర్ణయించింది.
హెచ్‌సీఎల్ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే హెచ్‌సీఎల్ యాజమాన్యం ప్రకటించింది. మేథ టవర్ నుంచి తాత్కాలికంగా సేవలు అందించనున్న హెచ్‌సీఎల్ స్థానికంగా ఉన్న వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటుందా అన్నదానిపై అనుమానంగా ఉంది. హెచ్‌సీఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం నూతనంగా నిర్మించబోయే హై రైజ్ బిల్డింగ్‌లో కార్యకలాపాలు ప్రారంభించటానికే స్థానికంగా ఉన్న యువతకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
మారో పక్క శాశ్వత భవనాలు కోసం, కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 చివరి నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్ ప్రణాలికలు రూపొందిస్తుంది...