నారా లోకేష్ పాదయాత్రలో రోజు రోజుకీ జనాలకి మరింత దగ్గరవుతున్నారు. సమస్యలు అధ్యయనం చేస్తూనే, పరిష్కారానికి మార్గం తెలుగుదేశం చూపుతుందని భరోసా ఇస్తున్నారు. తిరుపతిలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో యువనేత యువతతో ఇంటరాక్షన్ తో శెహభాష్ లోకేష్ అనిపించుకున్నారు. యువతీ యువకులు అడిగిన ప్రతిప్రశ్నకు లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు. యువత భవిష్యత్ కోసమే యువగళం పాదయాత్ర చేపట్టానని వివరించారు. జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకపాలనలో అధఃపాతాళానికి చేరిన ఏపీని తిరిగి అగ్రగామిగా నిలబెట్టేందుకు పాలనలో సమూల మార్పులు తీసుకొస్తామని యువతకి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించి జగన్‌కు రిటర్న్ గిఫ్టు ఇస్తానని ప్రకటించారు. విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని యువగళం ఎందుకు ప్రారంభించారని వ్యాఖ్యాత ప్రశ్నించగా, జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని బాగుచేసుకునేందుకు యువతని చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రారంభించానన్నారు. దేశంలోనే రాహుల్ గాంధీ తరువాత అతి ఎక్కువగా ట్రోలింగ్‌కి గురయ్యింది తానేనని చెబుతూనే, యువత భవిత కోసం ఏమైనా భరిస్తానన్నారు. తాను తెచ్చిన కంపెనీల వద్ద సెల్ఫీ తీసుకుని జగన్ రెడ్డికి ఛాలెంజ్ విసరడం ద్వారా తన కాలిబర్ ని చాటిచెప్పినట్టయ్యింది. వేలాది మంది యువతలో చైతన్యం కలిగించేలా హలో లోకేష్ కార్యక్రమం సాగింది. తాను మెగాస్టార్ అభిమానిని అని, బాలయ్య నా ముద్దుల మామయ్య అంటూ లౌక్యంగా సమాధానాలు ఇచ్చారు. స్లిమ్, ఫిట్ నెస్ కు కారణం భార్య బ్రాహ్మణి కారణమని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. పింక్ డైమండ్ ఆరోపణలపైనా సైటైరిక్ రియాక్షన్ యూత్‌కి బాగా కనెక్టయ్యింది. మొత్తానికి హలో లోకేష్ కార్యక్రమంతో యువతకి లోకేష్ బాగా దగ్గరయ్యారని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.
తిరుపతిలో నిర్వహించిన హలో లోకేష్ తో మరో మెట్టు ఎక్కిన లోకేష్
Advertisements