గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ కి, ప్రభుత్వ సొమ్ము అకారణంగా దోచి పెట్టారని, హెరిటేజ్ విషయంలోనే రూ.40 కోట్ల అవినీతి జరిగింది అంటూ, ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్, క్యాబినెట్ ముందు పెట్టటం, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై, సిబిఐ ఎంక్వయిరీ చేయించాలి అంటూ, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే దీని పై హెరిటేజ్ పూర్తి వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏపి ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్ళలో మాకు జరిగిన చెల్లింపులే అంత లేవని, మరి 40 కోట్ల అవినీతి అంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని హెరిటేజ్ పేర్కొంది. తమకు గత 5 ఏళ్ళలో ఏపి ప్రభుత్వం నుంచి జరిగిన చెల్లింపులు, రూ.22.68 కోట్లగా పేర్కొంది. 2015 - 2019 మధ్య మజ్జిగ సప్లై చేసినందుకు, ఏపి ప్రభుత్వం చెల్లించింది, రూ.1.49 కోట్లు అని తెలిపింది. ఇది కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా, వివిధ గుడిల దగ్గర, బ్రహ్మోత్సవాలకు, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, మొదలగు పండుగల సమయంలో ఇచ్చిన ఆర్డర్ అని, హెరిటేజ్ ఒక్కరికే ఈ ఆర్డర్ ఇవ్వలేదని తెలిపింది. అదే రేటుకి, మిగిలిన డైరీల నుంచి కూడా, ఆర్డర్ తెప్పించారని, అందులో హెరిటేజ్ ఒక కంపెనీ అని, హెరిటేజ్ కి మాత్రమే, ఏ కాంట్రాక్టు ఇవ్వలేదని తెలిపింది.

ఇక 2014 - 2017 మధ్య, అంటే 3 ఏళ్ళకు, నెయ్యి సప్లై చేసినందుకు, ఏపి ప్రభుత్వం చెల్లించింది, రూ.21.19 కోట్లు అని హెరిటేజ్ పేర్కొంది. ఇది కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా జరిగిందని చెప్పింది. అది కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే నెయ్యి సప్లై చేసామని, మిగతా జిల్లాలకు, అదే రేటుకి, మిగిలిన డైరీల నుంచి, ఆర్డర్ తెప్పించారని తెలిపింది. 2014-15లో కడప జిల్లాలో, 2015-2016లో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూల్, చిత్తూరు, కృష్ణా జిల్లాలో, 2016-17లో శ్రీకాకుళం జిల్లాలో నెయ్యి సప్లై చేసామని, దానికి మాకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.21.19 కోట్లు అని, మిగతా డైరీలకు ఇచ్చినట్టే మాకు చెల్లించారని తెలిపింది. గత 28 ఏళ్ళుగా, నిజాయితీగా, రైతుల సహకారంతో, వినియోగదారుల మద్దతుతో, ఎదిగామని, ఎన్నడు తప్పు చెయ్యలేదని హెరిటేజ్ పేర్కొంది. కావాలని ఇలా కుట్ర చేస్తే, కంపెనీ మీద ఆధారపడి జీవిస్తున్న వివిధ వర్గాల వారు, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడతారని హెరిటేజ్ పేర్కొంది. 28 ఏళ్ళుగా విలువలతో నడుపుతున్న కంపెనీ అని, భవిష్యత్తులో కూడా ఇలాగే నడుపుతాం అని పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read