తిత్లీ తుపాన్ బాధితులకు హెరిటేజ్ఫుడ్స్,హెరిటేజ్ ఉద్యోగుల భారీ విరాళాలు అందచేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు స్పందించిన హెరిటేజ్ సంస్థ,సామాజిక బాధ్యతగా మొత్తం రూ.66,16,971 విరాళంగా అందచేసింది. స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ఫౌండేషన్ కు రూ.48,50,000 విరాళం అందించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, హెరిటేజ్ ఉద్యోగుల సంక్షేమనిధి నుంచి రూ.17,66,971 విరాళంగా ఇచ్చారు. రెండు చెక్కులను ముఖ్యమంత్రికి అందజేసిన సంస్థ ప్రతినిధులు అందచేసారు. నగదు సాయంతో పాటుగా తుపాన్ బాధితులకు హెరిటేజ్ ద్వారా తాగునీటి పాకెట్ల పంపిణీ. తుపాన్ ప్రభావిత గ్రామాలలో పశువైద్య సేవలు కూడా అందించారు.

brahmini 18102018 2

ఇప్పటిదాకా 13.40లక్షల తాగునీటి పాకెట్ల పంపిణీ చేసారు. విశాఖ,విజయనగరం డెయిరీల్లో పాకెట్ల ద్వారా తాగునీటి అందచేసి,హెరిటేజ్ ద్వారా 2సంచార పశువైద్య క్లినిక్స్. 27 గ్రామాలలో ఫశువైద్య సేవలు హెరిటేజ్ వైద్యబృందాలు అందిస్తున్నాయి. పశువులను కోల్పోయిన పాడిరైతులకు బాసటగా హెరిటేజ్ నిలిచింది. బీమా దరఖాస్తులు నింపడంలో రైతులకు చేయూత. మరో పక్క, తిత్లీ తుఫాను బాదితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తిత్లీ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

brahmini 18102018 3

తమ వంతు సహాయంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరపున ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ (అమరావతి) ఛైర్మన్లు పి. అశోక్ బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు కొంత మొత్తం సహాయం చేయడానికి ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించారు. రిటైర్డు ఉద్యోగులు, లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు రూ. 200 చొప్పున, ఆ పై ఉద్యోగులు రూ. 500లు చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వనున్న జీతాలు, పెన్షన్ నుంచి ఈ మేరకు మినహాయించుకోవాలని వారు ప్రభుత్వానికి ఇచ్చిన అంగీకార పత్రంలో కోరారు. దీనివల్ల సుమారు రూ. 30 కోట్లు పైగా తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి సమకూరుతుందని తెలిపారు. బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుందని ఏపీ జేఏసీ ఛైర్మన్ పి. అశోక్ బాబు, ఏపీ జేఏసీ (అమరావతి) ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read