హైదరాబాద్‍లో సినీ నటుడు నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు సెహ్సారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నాని అన్నారు. థియేటర్లలో టికెట్ రేట్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా వస్తుందని అన్నారు. ఇప్పుడున్న టికెట్ ధరతో, సామాన్యులు టికెట్ కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నని అన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే, నాని పై వ్యాఖ్యలు చేసారు. అసలు నాని ఏమి అన్నారు అంటే, "సినిమా టిక్కెట్ల విషయంలో ఇప్పుడు ఏది జరుగుతుందో అది కరెక్ట్ కాదు. ఇది అందరికి తెలుసిన విషయమే కాని నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సినిమా విషయాలు,రాజికీయాలు పక్కన పెట్టేస్తే మీరు చేస్తున్న తప్పు ఏంటి అంటే మీరు ఆడియన్స్ ని అవమానిస్తున్నారు. ఒక పదిమందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కన ఉన్న కిరానా స్టోర్ ఎక్కువ ఉండటం కరెక్ట్ కాదు, లాజిక్ కూడా కాదు. మీరు ప్రేక్షకులను ఇన్సుల్ట్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది ఎలా ఉందంటే, పిక్నిక్ కి అందర్నీ డబ్బులు కట్టమని చెప్పి, నేను కట్టలేనని వదిలేసినట్టు ఉంది. అది నన్ను ఇన్సుల్త్ చేయడం కాదా. ఈ సినిమా టికెట్లకు కూడా లాంటిదే" అని నాని అన్నారు.
అయితే హీరో నాని మాటలకు వెంటనే వైసీపీ అనుకూలంగా మాట్లాడే నిర్మాత నట్టికుమార్ కౌంటర్ ఇచ్చారు. హీరో నాని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారని కోరారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అవమాన పరిచే విధంగా నని మాట్లాడారని, ఇది సరి కాదని నట్టి కుమార్ అన్నారు. టికెట్ ధరల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, వాళ్లకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ వద్దని అన్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల అంశం హైకోర్టులో ఉందని, అప్పటి వరకు కొంత ఆగాలని అన్నారు. సినిమాలకు వచ్చే కలక్షన్ల గురించి హీరో నానికి సరిగ్గా తెలియదని, ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఇప్పటికే టికెట్ పెంపు పైన, సినిమా పెద్దలు , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని అన్నారు. జనవరి నాటికి టికెట్ ధరల పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ కచ్చితంగా వస్తుందని, అప్పటి వరకు ఆగాలని అన్నారు. ఇక నాని ఈ రోజు టికెట్ ధరల పై మాట్లాడిన విషయం ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/UFFNQ3yojr0