"రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక కోసం ఆలోచిస్తాడు... ఒక దార్శనికుడు, వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు." అని పెద్దలు అంటూ ఉంటారు. అందరి విషయంలో ఏమో కానీ, మన కళ్ళ ముందు మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈయన కర్మ ఏమో కాని, చేసిన చాకిరీ అంతా చేస్తారు, ప్రజల చేతిలో మాత్రం ఓడిపోతారు. కాని ఆ ప్రాంతాన్ని మాత్రం నిలబెడతారు. హైదరాబాద్ విషయంలో అదే జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో ఇంత అభివృద్ధి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి అంటే, ఆ రోజు చంద్రబాబు వేసిన బీజం. హైటెక్ సిటీ రాకతో, సైబరాబాద్ సిటీతో, రూపు రేఖలే మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నా, లేకున్నా, హైదరాబాద్ ఆదాయంతో, తెలంగాణా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడ ప్రజలు మాత్రం, చంద్రబాబుని ఓడించారు. అంతే కాదు, అక్కడ ఆడిన రాజకీయ క్రీడలో, చంద్రబాబు పై తెలంగాణా ద్రోహి అనే ముద్ర కూడా వేసారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. పోలవరం 73 శాతం పూర్తీ చేసారు, అనేక కంపెనీలు తెచ్చారు.

hero 25122019 2

కాని ప్రజలు మాత్రం ఓడించారు. మా ప్రాంతం అంటే మా ప్రాంతం అంటూ, మనలో మనమే కొట్టుకుంటున్నాం. అయితే ఈ రోజు వచ్చిన వార్తా చూస్తే, చంద్రబాబు ఓడిపోయినా, చిత్తూరు జిల్లా మాత్రం గెలిచింది అని అనిపిస్తుంది. చంద్రబాబుని ద్వేషించే వాళ్ళు ఉంటారు ఏమో కాని, ఆయన చేసిన పనులు, కనీసం మనుసలో అయినా అభినందించే వాళ్ళు ఉంటారు అనటంలో ఆశ్చర్యం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఆటోమొబైల్స్ రంగ పారిశ్రామిక ప్రగతికి నాందిగా చిత్తూరు జిల్లాలోని సత్యవేడు వద్ద హీరో మోటర్ పరిశ్రమను నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, చిత్తూరు జిల్లాకు తీసుకోవచ్చి, శంకుస్థాపన కూడా చేసారు. అనంతపురంలో కియామోటర్స్, చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్, హీరో మోటర్స్ వంటి పరిశ్రమలు రావడం రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఉపకరిస్తుందని చంద్రబాబు భావించారు.

hero 25122019 3

అటువంటి భారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ యంత్ర పరికరాలు తయారు చేసే చిన్నచిన్న పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆయన ఆలోచించారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతం భవిష్యత్తులో దేశంలో అతిపెద్ద ఆటో మొబైల్ హజ్ గా ఆవిర్భవించే అవకాశాలున్నాయని, చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు, తిరుపతి, సత్యవేడు, పీలేరు ప్రాంతాలల్లో వచ్చిన ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల సమన్వయంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చంద్రబాబు ఆశ పడ్డారు. అందులో భాగంగానే 1.600 కోట్ల వ్యయంతో సత్యవేడు సమీపంలోని మాదనపాళెం వద్ద 600 ఎకరాలలో హీరో మోటర్స్ ద్వారా 15 వేలమందికి ఉపాధి లభించే ప్రాజెక్ట్ ను చిత్తూరుకు తీసుకువచ్చారు. నాడు చంద్రబాబు శంకుస్థాపన చేసి తెచ్చిన హీరో ప్లాంట్, నేడు మొదటి బైక్ ను తయారు చేసింది. మన రాష్ట్రం నుంచే ఇక హీరో బళ్ళు తయారు అవుతాయి. చంద్రబాబు చేసిన, అభివృద్ధి వికేంద్రీకరణ, చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనం ఈ హీరో ప్లాంట్. అందుకే చంద్రబాబు ఓడినా, చిత్తూరు జిల్లా మాత్రం గెలిచింది అని చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read