తెలుగుదేశం పార్టీ సరికొత్త సమీకరణాలు ప్రత్యర్థి వైసీపీకి అంతుబట్టటం లేదు. ఏపీలో సినీ పరిశ్రమ లేదు. ఏపీలోనైనా, తెలంగాణలోనైనా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. మరి టిడిపితో స్టార్ హీరోలకు పనేంటి అనేది ఇప్పుడు వైసీపీ వ్యూహకర్తలు చిక్కు ప్రశ్నగా మారింది. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి వరించగా సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో సత్సంబంధాలున్నాయి. ఎన్టీఆర్ అల్లుడు అయ్యాక మరింత బలపడ్డాయి. బాలయ్య వియ్యంకుడు కావడం సినీ పరిశ్రమతో విడదీయలేని బంధమైంది. అలాగే ముఖ్యమంత్రి చేసిన 14 ఏళ్లు, ప్రతిపక్షనేతగా దాదాపు 20 ఏళ్లు సినీ పరిశ్రమతో స్నేహసంబంధాలు కొనసాగించిన ఘనచరిత్ర చంద్రబాబుది. ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోయినా ఆయనని తమ గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా చాలా మంది భావిస్తారు. ఇటీవల బెంగళూరు టూర్కి వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కేజీఎఫ్ హీరో యష్ వచ్చి కలిసి వెళ్లారు. కన్నడనాట టాప్ హీరో అయిన యష్ లోకేష్ ని కలవడం కలకలం రేపింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఈ భేటీ దెబ్బకి ఇప్పటికీ చాలా మంది వైసీపీ నేతలకు నిద్రపట్టటంలేదు. తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ చంద్రబాబుని కలిసి తన ఫ్రెండ్ విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. కొద్ది రోజుల తేడాలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన తనయుడిని కన్నడ తెలుగు తమిళ్ సూపర్ స్టార్లు కలవడం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో గుబులు రేపుతోంది.
తెలుగుదేశానికి తెలుగు, తమిళ, కన్నడ హీరోల మద్దతు వెనక మర్మం?
Advertisements