జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు 2012 నుంచి నడుస్తూనే ఉంది. జగన మోహన్ రెడ్డి పైన 12 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, తన సొంత వ్యాపార సంస్థల్లో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ మోహన్ రెడ్డి చేసిన అవినీతి పైన సిబిఐ చార్జ్ షీట్లు వేసింది. ఇదే కేసులో జగన్ మోహన్ రెడ్డి జైలుకి కూడా వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే ఈ కేసులు విచారణ కోసం, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సి ఉన్నా, ఆయన వివిధ కారణాలతో వెళ్ళటం లేదు. ఇది ఇలా ఉంటే ఈ కేసుల పై రోజు వారీ విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే డిశ్చార్జ్ పిటీషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో, హెటిరో డైరెక్టర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. హెటిరో సంస్థను కూడా ఛార్జ్‌షీట్ నుంచి తొలగించేందుకు కోర్టు ఒప్పుకోలేదు. హెటిరో సంస్థనే కోర్టు ఒప్పుకోలేదు అంటే, జగన్, విజయసాయి వేసిన డిశ్చార్జ్ పిటీషన్లను కోర్టు ఏమి చేస్తుందో చూడాలి.
జగన్ కేసుల్లో హెటిరోకి షాక్ ఇచ్చిన హైకోర్టు.. రేపు జగన్, విజయసాయి రెడ్డికి కూడా షాక్ తప్పదా ?
Advertisements