మరో సారి... మరో రోజు... మరో మొట్టికాయి... హైకోర్టు చేతిలో గతంలో ప్రభుత్వంలో పెద్దలకు మొట్టికాయలు పడేవి. ఇప్పుడు తమ చేతికి మట్టి అంటకుండా చేస్తూ ఉండటంతో, అధికారులు బలి అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడటం, వారికి శిక్షలు పడటం, తరువాత వారు హైకోర్టుకు సారీ చెప్పటం, ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. విశాఖ మర్రిపాలెంకు చెందిన వ్యాపారి లలితేష్కుమార్, హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని అంటున్నారు అంటూ, పిటీషన్ వేసారు. ఈ విషయం పై చీఫ్ జస్టిస్ కు విన్నవించుకున్నారు. అయతే ఇదే స్థలం పై లీజు విషయంలో గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ హైకోర్టు ఆగ్రహం చేస్తూ, ఈ పిటీషన్ కాకుండా, కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయాలని, అధికారుల తప్పు తేలితే, తాము ఆ అధికారులను జైలుకు పంపుతాం అంటూ, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ అధికారిని జైలుకి పంపుతాం... హైకోర్టు ఆగ్రహంతో ఉలిక్కిపడ్డ ఐఏఎస్...
Advertisements