యథారాజా తథా ప్రజా అన్న చందంగా ఉంది ఏపీలో పరిస్థితి. ముప్పయికి పైగా కేసులున్న సీఎం కోర్టు వాయిదాలకి హాజరు కాకుండా ఎలా తప్పించుకుంటున్నారో, అధికారులూ కోర్టుల ఆదేశాలు అమలు నుంచి అలాగే తప్పించుకుంటున్నారు. అయితే హైకోర్టు ఈ సారి మరింత ఘాటుగా స్పందించింది. ఇప్పటివరకూ కోర్టులో సంబంధిత అధికారుల హాజరుకి ఆదేశించిన కోర్టు, తొలిసారిగా కోర్టు ధిక్కరణకి పాల్పడిన విద్యాశాఖాధికారులను జైలుకి పంపుతామని హెచ్చరించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని గతేడాది ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ ఏడాది 90 వేల సీట్లలో 9,064 సీట్లు మాత్రమే పేదలకు కేటాయించారని తన పిటిషన్ న్యాయవాది వివరించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది. 25 శాతం కోటా కింద ప్రైవేటు సంస్థల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించారో చెప్పాలని నిలదీసింది. కేటాయించిన సీట్ల వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
Advertisements