ప్రతి అయుదు ఏళ్ళకు ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు ఆదరిస్తే అవే ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటాయి. కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా అదే పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం అనేది, ఒక వ్యక్తీది కాదు, ప్రజలది. ఇది చంద్రబాబు సోత్తో, జగన్ సోత్తో, మోడీ సోత్తో కాదు. ప్రభుత్వాన్ని బాధ్యతగా చూసుకోమని, వారిని మనమే ఎన్నుకుంటాం. ప్రజలు ఏమి కావాలో, పాలకులు అదే చెయ్యాలి. ఒక ప్రభుత్వం మారితే, సగంలో ఉన్న పని, తరువాత వచ్చే ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అది ఆనవాయితీ. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి నా ప్రత్యర్ధి, తను చేసిన పనులు, నేను కొనసాగించను అని, కొత్తగా వచ్చే ప్రభుత్వ అధినేతలు చెప్తే, అది చాలా అనర్దాలకు దారి తీస్తుంది. అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టమే కాని, దాని వల్ల ఒరిగేది ఏమి ఉండదు. మన రాష్ట్రంలో ప్రస్తుతం అదే కొనసాగుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, కట్టిన ప్రజా వేదిక కూల్చేసారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, తెచ్చిన రైతు రుణమాఫీ రద్దు మధ్యలో ఉంటే, అది రద్దు చేసారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, అమరావతి మొదలు పెడితే, ఇప్పుడు అది కూడా ఆపేసారు.

court 09012020 2

అయితే అన్నిటికంటే ఘోరం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెల్లింపులు చెల్లించక పోవటం. చంద్రబాబు హయంలో, ఉపాధి హామీ పనులు చేసిన వారికి, రూ.1845 కోట్లు విడుదల చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ చెల్లింపులు చెయ్యలేదు. వాటికి వేరే వాటికీ వాడేసుకున్నారు అని టిడిపి ఆరోపిస్తుంది. అయితే, డబ్బులు రావాల్సిన వారు కోర్ట్ కు వెళ్లారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద, 2019-20 సంవత్సరానికి మొదటి విడత చెల్లింపుల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం రూ.1845 కోట్లను విడుదల చేసింది అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, అవి గ్రామ పంచాయతీలకు జమ చెయ్యలేదని పిటీషన్ వేసారు. దీని పై వాదనలు విన్న హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది.

court 09012020 3

ఇప్పటి వరకు ఆ నిధులు ఎందుకు ఇవ్వలేదని, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నెల రోజుల్లో వాటిని జమ చేయాలని తేల్చి చెప్పింది. ఇదే సందర్భంలో కేంద్రానికి కూడా హైకోర్ట్ గట్టిగానే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపొతే, మీరేం చేస్తున్నారు అంటూ, ఏమి చర్యలు తీసుకున్నారో, చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వం కాని, కౌంటర్ అఫిడవిట్ వెయ్యకపోవటం పై కూడా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ ఆదేశించినా కౌంటర్లు దాఖలు చేయలేదని, మరోసారి గడువు కోరతారా అంటూ, కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు 4 వారాల్లోగా ఇవ్వాలని, కేసుని వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం, ఈ ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read