న్యాయమూర్తుల పై అనుచిత పోస్టింగ్ లు పెట్టిన కేసు, ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు, సిబిఐ విచారణ చేస్తున్న ఈ కేసు విచారణకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ట్విట్టర్ సంస్థ, ఏదైతే సిబిఐ కానీ, హైకోర్టు కానీ ఆదేశాలు ఇస్తున్నాయో, ఆ ఆదేశాలకు అనుగుణంగా ట్విట్టర్ వ్యవహరించటం లేదని, సిబిఐ తరుపున, ఇటు హైకోర్టు తరుపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైగా ట్విట్టర్ లో ఇక్కడ ఏదైనా పోస్ట్ ని ఇక్కడ డిలీట్ చేసినా కూడా, vpn అని కొడితే, ఆ పోస్ట్ మళ్ళీ ట్విట్టర్ లో దర్శనం ఇస్తుందని, న్యాయవాది అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ లో ఎవరైనా ఒక పోస్ట్ పెడితే, ఈ దేశం నుంచి, వేరే దేశం వెళ్లటం కానీ, లేదా నేషనాలిటీ మార్చినా వెంటనే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయని, సిబిఐ తరుపు న్యాయవాది ర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ అంశం పై, ట్విట్టర్ పై సీరియస్ అయ్యింది. మీ మీద అసలు కోర్టు ధిక్కరణ కింద కేసు ఎందుకు నమోదు చేయకూడదు అంటూ, ట్విట్టర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, ట్విట్టర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ అంశం పైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, వచ్చే వారం లోపు తమ ముందు కౌంటర్ అఫిడవిట్ వెయాలని, ట్విట్టర్ ని ఆదేశించింది. అదే విధంగా ట్విట్టర్ కి సంబంధించి, భారత దేశంలో ఉండే, చట్టాలు, న్యాయ స్థానాలు, వీటి అన్నిటిపైన అవహగన తెచ్చుకోవాలని, వీటి పైన నిబంధనలు పాటించకపోతే మాత్రం, భారత దేశంలో మీరు వ్యాపారం ముసుకోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. మీ మీద పోలీసులను పంపి, మీ దగ్గర ఏదైతే జడ్జిల పైన పోస్టింగ్ లు ఉన్నాయో, ఆ మెటీరియాల్ మొత్తం స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇస్తామని కూడా హెచ్చరించింది. దీంతో పాటుగా, న్యాయమూర్తుల పైన దూషణలకు దిగిన, విదేశాల్లో ఉన్న వారిని, అరెస్ట్ ఎంత వరకు వచ్చిందని, వారి అరెస్ట్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, వచ్చే వారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని , కేసు విచారణ నిర్వహిస్తున్న సిబిఐ ని కూడా ఆదేశాలు జారీ చేసి, వచ్చే సోమవారానికి కేసుని వాయిదా వేసింది హైకోర్టు.