10 రోజుల క్రితం విశాఖపట్నంలో, వైసీపీ మూకలు, చంద్రబాబుని 5 గంటల పాటు అడ్డుకోవటం, తరువాత వైసీపీ వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుకు 151 నోటీస్ ఇచ్చి, అక్కడ నుంచి అరెస్ట్ చేస్తునట్టు చెప్పి, హైదరాబాద్ పంపించటం తెలిసిందే. ఈ మొత్తం ఘటన పై, తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. చంద్రబాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా, ఆయన్ను, అ-ల్ల-రి మూ-క-ల మధ్య, 5 గంటల పాటు ఉంచిన పోలీసులు పై సీరియస్ అయ్యింది. పోలీస్ పర్మిషన్ తీసుకు వచ్చినా, వైసీపీ మూకలు, ఎయిర్ పోర్ట్ లోకి ఎలా అనుమతి ఇస్తారు అంటూ, తెలుగుదేశం పోలీసులను ప్రశ్నించింది. అయితే ఈ మొత్తం వ్యవహరం పై, హైకోర్ట్ లో కేసు వేసింది తెలుగుదేశం పార్టీ. గత వారం హైకోర్ట్ లో ఈ కేసు పై విచారణ జరిగింది. ఎక్కడైనా గొడవ చేసిన వారిని అరెస్ట్ చేస్తారు కాని, పోలీస్ పర్మిషన్ ఇచ్చి వచ్చిన చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేసారు అంటూ, హైకోర్ట్ పోలీసుల పై సీరియస్ అయ్యింది. పోలీసులు ఇచ్చిన నివేదిక పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్ట్, ఈ రోజు డీజీపీని కోర్ట్ కు రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్ట్ ఆదేశాలు ప్రకారం ఈ రోజు డీజీపీ, హైకోర్ట్ కు హాజరు అయ్యారు. విశాఖలో చంద్రబాబుకు సీఆర్సీసి 151నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ఈ నోటీసు పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. సిఆర్పీసీ సెక్షన్ 151 ని చదవమని డీజీపీని హైకోర్ట్ అడిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. డీజీపీని సీఆర్సీసి 151నోటీసు చదవమని, ఆయన చేతే, 151 నోటీసు ఎందుకు వాడతారో చెప్పించే ప్రయత్నం చేసింది హైకోర్ట్. ఇదే సందర్భంలో, 151 కింద నోటీసు ఇచ్చిణ, పోలీసులపై యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని హైకోర్ట్ అడిగింది. విశాఖ పోలీసు అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, హైకోర్ట్ డీజీపీని ప్రశ్నించింది. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ హైకోర్ట్ కు తెలిపారు,
కోర్టు ఆదేశిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీజేపీ చెప్పారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా, చంద్రబాబు విజయనగరంలో పర్యటించాలని, గత నెల 27 న నిర్ణయం తీసుకున్నారు. అయితే, అదే సందర్భంలో, విశాఖపట్నంలో, వైసీపీ ఎమ్మెల్యే పేదల భూములు లక్కోవటం, చెరువు ఆక్రమించటం లాంటి సంఘటనలు తెలుసుకుని, అక్కడకు వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు పోలీస్ పర్మిషన్ కూడా ఇచ్చారు. చంద్రబాబు అక్కడకు వస్తే, ఇబ్బంది అనుకున్నారో ఏమో, వైసీపీ నేతలు, తమ వారిని ఎయిర్ పోర్ట్ కు తోలి, చంద్రబాబుని అడ్డుకున్నారు. 5 గంటల పాటు ఆయన రోడ్డు మీద ఉన్నారు. చివరకు అడ్డుకున్న వారిని కాకుండా, చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేసారు.