అది ఎంతో ప్రతిష్టాత్మికంగా జరగాల్సిన కార్యక్రమం. ఒక్క చిన్న పొరపాటు కూడా జరగటానికి వీలు లేదు. అందుకు తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేసామని, అధికారులు, ప్రభుత్వం చెప్పింది. చివరకు స్టేజ్ పైన, గవర్నర్, హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్, జగన్ మోహన్ రెడ్డి ఉండగానే, రాష్ట్ర పరువు గంగలో కలిసింది. అధికారుల నిర్లక్ష్యానికి, జాతీయ మీడియా సమక్షంలో, మన రాష్ట్ర పరువు పోయింది. ఆంధ్రపదేశ్ ప్రజలు సిగ్గు పడే విధంగా, అధికారుల చేసిన పొరపాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు పని తీరుకు, ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తూ, చివరకు ఇలా చేసారు ఏంటి అని, అందరూ అడిగే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇది ప్రభుత్వ పెద్దల అలసత్వంతో, అధికార యంత్రాంగం చేసిన పనిగా చూడాలా ? లేక కేవలం ఈ తప్పు అధికారుల మీదకు తోసేసి, బాధ్యుల పై చర్య తీసుకుంటే అయిపోతుందా ?

cj 07102019 2

ఇక విషయానికి వస్తే, అది హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రామాణస్వీకర కార్యక్రమం. హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూర్తీ బాధ్యత తీసుకోవాలి. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా, అపాయింట్ చేసిన చీఫ్ జస్టిస్ చేత, మన రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేపిస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా, మన అధికారుల చేసిన అతి పెద్ద తప్పిదంతో, అందరూ అవాక్కయ్యారు. ఏకంగా గవర్నర్, సియం స్టేజ్ మీద ఉండగానే, ఈ పొరపాటు జరిగింది. మన రాష్ట్రం పేరు కూడా సరిగ్గా టైపు చెయ్యలేని, అతి పెద్ద పొరపాటు. హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ కి ఇచ్చిన ప్రమాణ పత్రంలో, "ఆంధ్రప్రదేశ్"కు బదులు "మధ్యప్రదేశ్" అని రాసి ఇచ్చారు, మన అధికారులు.

cj 07102019 3

గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తున్న పేపర్ లో ఆంధ్రప్రదేశ్ అని ఉండగా, ఛీఫ్ జస్టిస్ పేపర్ లో మాత్రం, మధ్యప్రదేశ్ అని ఉంది. చీఫ్ జస్టిస్ కూడా, అధికారులు రాసిచ్చిన పత్రం ప్రకారం, "ఆంధ్రప్రదేశ్" బదులుగా "మధ్యప్రదేశ్" అని చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి చేత మరోసారి ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు మహేశ్వరి, జగన్ తో పాటు పలువురు ఆహూతులు హాజరయ్యారు. అయితే అధికారులకు ఆ మాత్రం, మన రాష్ట్రం పేరు గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి, మధ్యప్రదేశ్ కి తేడా తెలియకుండా, ఇలా ఏకంగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ చేతే, తప్పుగా చదివించటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు, ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read