మాజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఐవైఆర్ కృష్ణారావు గతం మర్చిపోయారు... అవును, మీరు వింటుంది నిజమే... అమరావతిని ఆపటానికి, జే గ్యాంగ్ తో ప్లాన్ వేసి, స్విస్ చాలెంజ్ ఆపెయ్యమని కోర్ట్ లో కేసు వేసారు ఐవైఆర్.. నిన్న కేసు విచారణ సమయంలో, ‘స్విస్ చాలెంజ్ విధానంపై నోటిఫికేషన్ జారీచేసినపుడు మీరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాహిత ప్రయోజనం (పిల్) ఎలా వేస్తారు? ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌పై ఆనాడు మీ అభ్యంతరాలు నమోదు చేశారా’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును హైకోర్టు నిలదీసింది.
ఈ విషయం తనకు అంతగా గుర్తులేదని.. అందుకు సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకుని కోర్టుకు చెబుతానని ఆయన చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మీ హయాంలోనే రూపొందించిన ఈ విధానంపై అప్పుడు మీరు ఏం చేశారో తెలియదని మీరే చెబితే ఎలా? ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాలు ఉండాలి.. వ్యక్తిగతం కాకూడదు. పిల్ నిబంధనలు ఏం చెబుతున్నాయో చదువుకోండి’ అని హితవు పలికింది. స్విస్ చాలెంజ్ విధానం రూపొందించినప్పుడు మీరు సీఎ్‌సగా ఉన్న విషయాన్ని పిల్‌లో ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రశ్నిస్తూ.. ఐవైఆర్ కృష్ణారావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చినపుడు, దీనిపై ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ..స్విస్ ఛాలెంజ్ విధాన్నాన్ని రూపొందించిన సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఐవైఆర్ కృష్ణారావు విధాన నిర్ణయంలో భాగస్వామి అయినందు వల్ల, ఈ విధానాన్ని ప్రశ్నించే అర్హత లేదన్నారు. దీనిపై ప్రథమ నోటిఫికేషన్ నమూనాను మే, 2015లో జారీ చేసినట్లు తెలిపారు. ఈ అంశాలను అఫిడవిట్ లో ఎందుకు వివరించలేదని ధర్మాసనం ఐవైఆర్ ను ప్రశ్నించింది. దీనిపై ఐవైఆర్ స్పందిస్తూ ..ఆ సమయంలో తాను ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విషయం వాస్తవమేనన్నారు. కానీఅఫిడవిట్ లో పేర్కొనలేదన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అదనప ప్రమాణ పత్రం దాఖలు చేస్తానని తెలిపారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.